పాముకు ఊపిరి పోశాడు..
posted on Jun 21, 2021 @ 11:45AM
కరోనా టైంలో ఆక్సిజన్ అంతకపోతే చాలా మంది ఆక్సిజన్ అందిస్తున్నారు. అయితే సాధారణంగా ఎవరైనా కళ్ళముందు శ్వాస అందక కొట్టుమిట్టాడుతుంటే చూసి జాలి పడతాం. వాళ్ళను కాపాడడానికి మన ప్రయత్నం మనం చేస్తాం..కొంచెం జాలి గుండె కలవారైతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇక కాస్త అవగాహన ఉండి, మనసున్న వారైతే వెంటనే నోట్లో నోరు పెట్టి ఊపిరి ఊది ప్రాణం పోసే ప్రయత్నం చేస్తారు.
మరి ఒక పాము ఊపిరి అందక కొట్టుమిట్టాడుతుంటే ఏం చేస్తాం. మనుషులనే పట్టించుకోవడం లేదంటే మళ్ళీ పాము గురించి మాట్లాడుతావ్ ఏంటి భయ్యా అని అనుకుంటున్నారా ? అంతేగా.. అంతేగా .. సాధారణంగానైతే పాముని చూస్తేనే ఒళ్ళు వణికిపోతుంది.. తడిసి ముద్దవుతుంది. ఒక వేళా ఎవరైనా పామును చూశారు అనుకుందాం.. దాన్ని చూడగానే పనుకుంది వెళ్లడమో.. లేదంటే దాన్నీ చంపడమే చేస్తారు. ఒక వేళ ఏ స్థితిలో ఉందో కూడా పట్టించుకోం. వెంటనే దానికి ఆమడ దూరం పరుగెడతాం. పాముకు కూడా మనం అంటే భయం ఎక్కడ దాన్ని చంపేస్తామో అని. కానీ, ఇక్కడ అంతా రివర్స్ జరిగింది. ఒక్క వ్యక్తి మనుషుల వలే దాన్ని కూడా దగ్గరకు తీసుకొని నోట్లో నోరు పెట్టి ఊపిరి ఊదే సాహనం ఎవరైనా చేస్తారా? అసలు ఊహకు కూడా అందడం లేదు కదా?
స్నేహాశీష్ అనే వ్యక్తి స్థానికంగా పాములను పట్టుకుంటుంటాడు. అలాగే ఎలకలు ఉన్నచోట పాములు కూడా వాటి ఆహారం కోసం వస్తుంటాయి. అలా ఎలుకను వేటాడుతూ ఓ ఇంట్లోకి దూరిన పాము ఓ కన్నంలో ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న స్నేహాశీష్ వెంటనే అక్కడికి చేరుకొని ఆ 10 అడుగుల పామును బయటకు తీశాడు. కానీ, అది అప్పటికే అపస్మార స్థితిలోకి వెళ్లడం గమనించాడు. ఊపిరి ఊదాలని తలచాడు. చుట్టుపక్కల చూడగా.. ఓ స్ట్రా కనపడింది. వెంటనే దాన్ని పాము నోట్లో పెట్టి ఊపిరి ఊదాడు. దాదాపు 15 నిమిషాల తర్వాత అది స్పృహలోకి వచ్చింది. ఆ పాముకు ఎలాంటి ప్రాణాపాయం లేదని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతుంది. వన్యప్రాణుల అభిమానులు, వాటికి ఆదరించే వాళ్ళు పాముకి ప్రాణం పోసిన స్నేహాశీష్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సంఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో జరిగింది.