రైలు ప్రమాదంలో 47మంది మృతి
posted on Jul 30, 2012 @ 11:04AM
సోమవారం తెల్లవారుజామున తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 47మంది మృతి చెందినట్లు అధికారులు ద్రువికరించారు. మరో 25 మందికి గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు. మాంసం ముద్దలుగా మారిన శవాల్ని బోగీ నుంచి అతి కష్టమ్మీద బయటకు తెచ్చేందుకు సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రమాదానికి గురైన ఎస్-11 బోగీతో పాటు మరో నాలుగు బోగీలను అధికారులు నెల్లూరులో నిలిపివేశారు. మిగిలిన బోగీలతో రైలు చెన్నైకి బయల్దేరింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌లోని కాప్రాకు చెందిన శాలిని అనే యువతి మరణించింది.
Nellore accident: Helpline - Secunderabad 040-27786723/27700868/27786539, Nellore 0861-2345863/2345864/2345866
Nellore accident: Helpline - Vijayawada 0866-2576924/2575038/2576796/25761072 and Warangal 0870-2426232/097013-37106.