తుది దశ పోలింగ్: బెంగాల్లో గొడవలు
posted on May 12, 2014 @ 3:58PM
తొమ్మిది దశల్లో నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ సోమవారం జరుగుతోంది. ఈ తుది దశలో ఉత్తరప్రదేశ్‌లోని 18 స్థానాలు, పశ్చిమబెంగాల్‌లోని 17, బీహార్‌లోని 6 స్థానాలతోకలిపి మొత్తం 41 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాశి నియోజకవర్గంలో కూడా పోలింగ్ జరుగుతోంది. ఈ దశ ఎన్నికల బరిలో 606మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 6.61కోట్ల మందికిపైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో మోడీతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గంనుంచి ఆమ్ ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆజంగఢ్‌నుంచి ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఖుషీనగర్‌నుంచి కేంద్రమంత్రి ఆర్పీఎన్‌సింగ్, డొమారియాగంజ్‌నుంచి బీజేపీ సీనియర్‌నేత జగదాంబికాపాల్, పశ్చిమబెంగాల్‌లోని బెహ్రంపూర్ నుంచి కేంద్రమంత్రి ఆధిర్ రంజన్ చౌదరి, బారాసత్‌నుంచి బీజేపీ అభ్యర్థిగా మెజీషియన్ పీసీ సర్కార్ (జూనియర్), బీహార్‌లోని వైశాలినుంచి ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం తుదివిడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం చాలా ప్రదేశాల్లో గొడవలు జరిగినట్టుగా సమాచారం అందుతోంది.