ఇది ప్రజా విజయం: ఫలితాలపై చంద్రబాబు స్పందన
posted on May 12, 2014 @ 3:53PM
మునిసిపల్ ఎన్నికలలో సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం, తెలంగాణలో కూడా గట్టి పోటీ ఇచ్చి ఎవరూ ఊహించని విధంగా మంచి ఫలితాలను సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రజలు సాధించిన విజయమని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ మీద ఎంతో నమ్మకంతో ఇంతటి విజయాన్నిచ్చిన ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పదేళ్ళుగా కాంగ్రెస్ పరిపాలనలో నరకం చూసిన ప్రజలు ఈసారి కాంగ్రెస్‌ని సీమాంధ్ర నుంచి తరిమికొట్టడంతోపాటు వైకాపా ప్రలోభాలకు లొంగకుండా ఓటేశారని చంద్రబాబు అన్నారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనేచోట్ల ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తరిమికొట్టిన ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అండగా వున్న ప్రజలకు, కార్యకర్తలకు తమ పార్టీ వెన్నంటి వుంటుందని చంద్రబాబు చెప్పారు.