లాక్ డౌన్ సడలింపులు ఇవే..
posted on Jun 17, 2021 @ 9:43AM
తెలంగాణాలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈనెల 19తో తెర పడనుంది. దీంతో ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు సమరశంఖం మొగియ్యనుండి. కరోనా కేసులు తగ్గడంతో భారీగా సడలింపులు చేసే ఆలోచన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.. అయితే ప్రస్తుతం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈనెల 19తో ముగియనుంది. 20వ తేదీ నుంచి సడలింపు సమయాన్ని పెంచాలని సర్కార్ ఆలోచిస్తుంది. ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చారు. అయితే సడలింపు సమయాన్ని రాత్రి 9 గంటల వరకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలుపై కేబినెట్ భేటీలో సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేదంటే మంత్రులతో మాట్లాడి ఆయన ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
లాక్ డౌన్ సడలింపు సమయాన్ని పొడిగించి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలను అనుమతించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబు తున్నాయి. ప్రజలు తమ గమ్య స్థానాలకు చేరుకోవడానికి రాత్రి 10 వరకు వెసులుబాటు కల్పించి, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో పలు చోట్ల మాత్రం లాక్ డౌన్ అమలు చేయనున్నారు. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మరో 10 రోజుల పాటు ప్రస్తుత విధానంలోనే లాక్‌డౌన్ అమలు చేసేలా నిర్ణయం తీసుకునే అవకాశముంది.
కరోనా వాళ్ళ ప్రాణాలు పోతే.. లాక్ డౌన్ వల్ల బతకడానికి ఉన్న భరోసా పోతుంది. ఇక అటు దేశం లోను ఇటు తెలుగు రాష్ట్రాల నాయకులూ అయితే ప్రజల మీద ఉన్న ప్రేమ కంటే కుర్చీల మీద మోజు వుందని చెప్పాలి.. కోవిద్ టైం లో కూడా ఎన్నికలకు వెళ్లిన దేశం ఏదైనా ఉందంటే అది మన దేశమని గర్వగా చెప్పుకోవాలి. ప్రజల ఆరోగ్యం పట్టని పాలకులు ఎవరైనా ఉన్నారంటే మన నాయకులను చూపించాలి.. ఒక వైపు కరోనా సమాయులతో ఫుట్ బాల్ ఆడుతుంటే మన నాయకులూ మాత్రం ప్రజలతో వాళ్ళ ప్రాణాలతో రబ్బీ గేమ్ ఆడుతున్నారు. ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి ఎలాంటి నిర్ణయాలు చేపట్టాయో..ప్రరోక్షంగా ప్రత్యేక్షంగా ఎంత మందిని పొట్టన పెట్టుకున్నారో అందరికి తెలిసిన విషయమే.. మరి థర్డ్ వేవ్ కి ఎలా ప్రిపేర్ అయ్యారో చూడాలి.. ప్రిపేర్ ఆవ్వకుండా ఏం.. పీకే వచ్చారు అని గతంలో అసెంబ్లీలో మాట్లాడిన నాయకులూ థర్డ్ వావ్ కి ఎలా ప్రిపేర్ అయ్యారో చూడాలి మరి..