చిప్పు దొబ్బింది.. భార్యను రెండో సారి పెళ్లిచేసుకున్నాడు..
posted on Jun 17, 2021 9:17AM
ఎవరైనా ఒక సారి, ఒక అమ్మాయి ని ప్రేమించో, లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. కానీ మనం మాట్లాడుకునే ఈ వార్తలో ఆల్రెడీ పెళ్లి చేసుకుని.. మళ్ళీ గతం మరిచి మళ్ళీ తన భార్యకే ప్రపోజ్ చేసి.. మళ్ళీ ఆమెను రెండో సారి పెళ్లి చేసుకున్నాడు.. ఏంటి ? ఏదో సినిమా కథలా ఉంది అనుకుంటున్నారా? ఇలాంటివన్నీ స్క్రీన్ మీద జరుగుతాయి జీవితంలో జరగవు అని అనుకుంటున్నారా..? సమస్యేలేదు సమస్యే లేదు మీరు అలా అనుకుంటే కరోనా మీద కాలు వేసినట్లే.. విషయం లోకి వెళదాం..
పెళ్లి ఆడ, మగ ఇద్దరు నిండు నూరేళ్ళ.. నింగినేల ఉన్నంత వరకు, కలకాలం కలిసి ఉండే ఓ పవిత్రమైన బంధం. ప్రతి వ్యక్తి తన లైఫ్ లో అంగరంగ వైభవంగా జరుపుకొనే వేడుక పెళ్లి. నిండు నూరేళ్లు కలిసి జీవిస్తామని ఒకరికొకరు ప్రమాణం కూడా చేస్తారు. అయితే, పెళ్లినాటి ప్రమాణాలు కలకాలం ఉండాలంటే.. భార్యాభర్తలు ప్రేమగా, ఒకరినొకరు గౌరవించుకుంటూ అన్యోన్యంగా ఉండాలి.భార్యని భర్త, భర్తని భార్య అర్థం చేసుకుంటూ ముందుకు సాగితేనే పెళ్లి అనే ప్రమాణం ఆ బంధం నిలబడుతుంది, నిక్కచ్చిగా ఉంటుంది.కట్ చేస్తే.. మనం తెలుసుకోబోయే ఈ జంట జీవితంలో కొంచం భిన్నంగా ఉంటుంది. అలా అని వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కానీ, భర్త మతిమరుపు.. జీవితాన్ని మళ్లీ వెనక్కి తీసుకెళ్లింది. ఎందుకంటే.. అల్జీమర్స్‌తో బాధపడుతున్న అతడు తనకు పెళ్లయిన విషయాన్నే మరిచిపోయాడు. తన భార్యను కూడా రిమెంబర్ చేసుకోలేకపోయాడు. కానీ, విధి మాత్రం వారికి అన్యాయం చేయలేదు. జ్ఞాపకశక్తి కోల్పోయినా.. అతడు మళ్లీ ఆమెనే భార్యగా కోరుకున్నాడు. మళ్లీ ఆమెకే ప్రపోజ్ చేసి.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా’’ అని అడిగాడు. ఇందుకు ఆమె ‘YES’ చెప్పింది.
విరాల్లోకి వెళితే..56 ఏళ్ల పీటర్ మార్షల్ పన్నెండేళ్ల కిందట లీసాను వివాహం చేసుకున్నాడు.పెళ్లయిన కొన్నేళ్లలోనే అతడు అల్జిమర్స్‌కు ఎటాక్ చేసింది. ఫలితంగా అతడు క్రమేనా జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. వస్తువులు, ప్లేసెస్ తో పాటు మనుషులను గుర్తుపట్టడం కూడా అతడికి కష్టంగా మారింది. చివరికి అతని భార్యను కూడా మరిచిపోయాడు. రోజూ ఉదయం లేవగానే ఎవరు నువ్వు అని అడుగుతాడు. లైక్ భలేభలే మగాడివోయి సినిమాలో నాని క్యారెక్టర్ లా చేసేవాడు. కనీసం పేరు కూడా గుర్తుకు రాదు. దీంతో ఆమె నేను నీ భార్య లిసాను అని చెప్పుకోవల్సి వస్తోంది. వారి గతంలో ఉన్న గుర్తులను అన్ని చెప్పింది అయిన అతనికి గుర్తురాలేదు. ఏది ఏమైనాగాని అతడి మనసు నుంచి మాత్రం ఆమె ఏ రోజు దూరంగా పోలేదు.
ఓ రోజు లిసా అతడికి టీవీలో వారి పెళ్లి వీడియో చూపించింది. అయితే, అతడికి ఏదీ గుర్తురాలేదు. దీంతో లిసా చొరవ తీసుకుని మనం కూడా ఆ వీడియోలో ఉన్నట్లు పెళ్లి చేసుకుందామా అని అడిగింది. ఆమె అలా అడగగానే పీటర్ ముఖం వెలిగిపోయింది. ఆ వెంటనే ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం’’ అన్నాడు. దీంతో ఆమె మళ్లీ తన అంగీకారాన్ని తెలుపుతూ ఉబ్బితబ్బిబయ్యింది. అతడు జ్ఞాపకశక్తిని కోల్పోయినా తన మీద ప్రేమ తగ్గలేదని, ఇప్పటికే అతడికి తానంటేనే ఇష్టమని ఆమె మురిసిపోయింది. రెండోసారి అతడితో పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయంపై అతని భార్య స్పందిస్తూ ‘‘నేను చాలా లక్కీ. నా జీవితంలో రెండోసారి ఆ ఆనందాన్ని పొందుతున్నాను’’ అని లిసా తెలిపింది. వీరి పెళ్లి ఏర్పాట్లు చేసింది మరెవ్వరో కాదు.. స్వయంగా వారి కూతురే. ఈ స్పెషల్ వెడ్డింగ్‌కు ఉచితంగా ఏర్పాట్లు చేస్తామని కొన్ని సంస్థలు ముందుకు రావడం గమనార్హం. పెళ్లి ప్రపోజల్ తర్వాత అతడిలో ఆనందాన్ని చూశానని, అతడి వ్యాధి కూడా క్రమేనా తగ్గుముఖం పడుతోందని లిసా తెలిపింది. అంత మతిమరపులోను అతడు తన ప్రేమను మరచిపోలేదంటూ ఆనంద భాష్పాలు కురిపించింది. పెళ్లి సందర్భంగా అతడు తన చెవిలో.. ‘‘నాతో ఉన్నందుకు ధన్యవాదాలు’’ అని చెప్పాడని ఆమె పేర్కొంది. మతిమరుపు మెదడుకు ఉంటుందేమో.. కానీ, మనసుకు కాదని లీసా-పీటర్‌ల గురించి చదివితే అనిపిస్తోంది కదూ.