శీతాకాలంలో కాలేయాన్నిఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు..!

 

కాలేయం శరీరంలోని ముఖ్యమైన అవయవం. ఇది టాక్సిన్స్‌ను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. వాతావరణ పరిస్థితిని బట్టి కాలేయాన్ని శుద్ది చేసుకోవడం,  కాలేయ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి. వేసవి కాలంలో కాలేయాన్ని శుద్ది  చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.  అయితే శీతాకాలంలో కాలేయాన్ని శుద్ది చేసుకోవడం గురించి చాలామందికి తెలియదు. శీతాకాలంలో కాలేయాన్ని శుద్ది చేసుకోవాలంటే ఈ కింది టిప్స్ పాటించాలి.

పసుపు, అల్లం, నిమ్మకాయ..

శీతాకాలంలో పసుపు, అల్లం,  నిమ్మ వంటి సహజ పదార్థాలు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. పసుపులో యాంటీఆక్సిడెంట్ గుణాలు అలాగే కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది.  ఇది కాలేయ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.

అల్లం జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది,  కాలేయానికి మేలు చేస్తుంది. అంతే కాకుండా, నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.

 ఈ మూడింటి మిశ్రమాన్ని తీసుకోవచ్చు లేదా  ఎంపిక ప్రకారం వివిధ రూపాల్లో తినవచ్చు. వాటిని గోరువెచ్చని నీటితో కూడా తీసుకోవచ్చు. ఇది కాలేయానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సిట్రస్ పండ్లు..

శీతాకాలంలో నారింజ, నిమ్మకాయలు,  ద్రాక్షపండ్లు వంటి తాజా సిట్రస్ పండ్లు కాలేయాన్ని శుద్ది  చేయడంలో సహాయపడతాయి. సిట్రస్ పండ్లలో సహజ ఆమ్లాలు ఉంటాయి. ఇవి కాలేయం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. పండ్లను నేరుగా తినవచ్చు   లేదా జ్యూస్  తయారు చేసి త్రాగవచ్చు. పండ్లు తీసుకోవడం వల్ల  కాలేయంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది.


గోరువెచ్చని నీరు..

చలికాలంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చల్లని వాతావరణంలో చాలాశాతం మంది తక్కువ నీరు తాగుతారు. అందువల్ల శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది.  అందుకే వేడి లేదా గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఇది కాలేయాన్ని శుభ్రపరచడంలో..  శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.  ఉదయాన్నే ఒక గ్లాసు వేడి నీటిని త్రాగడం లేదా  రోజంతా గోరువెచ్చని నీటిని తాగడం చేయవచ్చు. వేడి నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది,  కాలేయాన్ని క్లీన్  చేయడంలో కూడా సహాయపడుతుంది.

పండ్లు, కూరగాయలు..

బచ్చలికూర, ఆవాల ఆకు, ముల్లంగి ఆకులు,  క్యారెట్లు వంటి ఆకు కూరలు శీతాకాలంలో కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ కూరగాయలలో ఫైబర్, విటమిన్లు,  ఖనిజాలు ఉంటాయి, ఇవి శరీరానికి తాజాదనాన్ని అందిస్తాయి.  కాలేయం సక్రమంగా పనిచేస్తాయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా బీట్‌రూట్, గుమ్మడికాయ,  బ్రకోలీ వంటి కూరగాయలు కూడా కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఈ పండ్లు,  కూరగాయలలో ఉండే పోషకాలు కాలేయ పనితీరును మెరుగుపరస్తాయి.


ఫిజికల్ యాక్టివిటీ..

చలికాలపు సీజన్ లో ఆరోగ్యంగా ఉండాలంటే లివర్ డిటాక్సిఫికేషన్ తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ముఖ్యం. వ్యాయామం,  యోగా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.  కాలేయం నుండి టాక్సిన్స్ బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది.  చలికాలంలో  దినచర్యలో తేలికపాటి యోగా లేదా ఇతర శారీరక కార్యకలాపాలను చేర్చుకోవచ్చు.

మంచి మార్గాలు..

చలికాలంలో కాలేయం శుద్ది చేసుకోవాలంటే.. ఆకు కూరలు, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి అనేక కూరగాయలుతో పాటు యాపిల్స్, ద్రాక్ష,  సిట్రస్ పండ్లను తినడం మంచి మార్గం.  వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవోకాడో,  నట్స్ ద్వారా  ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోవచ్చు. ప్రాసెస్ చేసిన ఆహారాలు కాలేయంపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి కాబట్టి వీటిని తగ్గించాలి, వీలైతే మానేయాలి.  ఆహారంలో పసుపు,  అల్లం చేర్చాలి.  ఎందుకంటే అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి.  నీటిలో  డిటాక్స్ గుణాలు పెరగడానికి  నిమ్మకాయ ముక్కలను జోడించాలి.


                                       *రూపశ్రీ.