గంటా పంట పండినట్టే!
posted on Oct 26, 2012 @ 1:44PM
మళ్లీ ఎన్నికల లోపు ఇదే చివరి విస్తరణ అని ఎప్పటికప్పుడు చెప్పే ప్రధాని మన్మోహన్‌సింగ్ మరోసారి కేబినెట్‌ను విస్తరిస్తున్నారు. ఈసారి ప్రధానంగా పార్టీని బలోపేతం చేసేందుకు కేబినెట్‌లో మార్పులు తెస్తున్నారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీని కేబినెట్‌లోకి తీసుకుంటారని అంటున్నారు. ఏది ఏమైనా ఆదివారం జరగనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో చిరంజీవికి టూరిజం మంత్రిత్వ శాఖను కట్టబెట్టే అవకాశం వుందని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. రాయలసీమలో జగన్ హవాను అడ్డుకోవడానికి కోట్ల సూర్యప్రకాశరెడ్డికి, తెలంగాణలో చంద్రబాబుకు ఓటుబ్యాంకుగా మారుతున్న మాదిగల దృష్టిని కాంగ్రెస్‌వైపు మరల్చడంకోసం సర్వే సత్యనారాయణకు మంత్రి పదవులు ఇవ్వవచ్చని అంచనా. చిరంజీవికి మంత్రి పదవి కొంతకాలంగా పెండిరగ్‌లో వుంది. ఈసారి కేబినెట్‌లోకి తీసుకొని, ఊహిస్తున్న విధంగా టూరిజం శాఖను అప్పగించే పక్షంలో రాష్ట్ర మంత్రి, ప్రజారాజ్యీయుడు గంటా శ్రీనివాసరావు పంట పండినట్టేనని భావిస్తున్నారు. విజయవాడ దగ్గర భవానీ ఐలాండ్‌తో పాటు అనేక టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి గంటాకు వ్యాపార ప్రయోజనాలు ఇమిడి వున్నాయి. విశాఖలో చిరంజీవి సినిమా స్టూడియో నిర్మాణం చేయబోతున్నారని కూడా స్వయానా గంటా వెల్లడిరచారు. వైజాగ్‌ను సినిమా షూటింగ్ హబ్‌గా మార్చాలనే సంకల్పంతో గంటా తదితరులు వున్నారని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవికి టూరిజం శాఖ దక్కితే గంటా తదితరుల ఆశలన్నీ నెరవేరినట్టే!