తెలంగాణలో ఉన్నంత కఠినంగా, ఆంధ్ర లో ఎందుకు ఉండలేకపోతున్నారు?
posted on Apr 19, 2020 @ 8:12PM
* కర్నూలు లో వర్గ సంతుష్టీకరణ రాజకీయాలు
* ఎం ఎల్ ఏ ఒత్తిడికి తలొగ్గిన కలెక్టర్, ఎస్ పి
* ఇంతియాజ్ మామ గారిని వెనకేసుకు రావడానికి కారణమేమిటి
ఆంధ్ర ప్రదేశ్ లో వర్గ సంతుస్టికరణ రాజకీయాలు జరుగుతున్నాయా? కళ్లెదుట కనపడుతున్న సంఘటనలు చూస్తుంటే, ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. కర్నూల్ వైసీపీ ఎం ఎల్ ఏ హఫీజ్ ఖాన్ అధికార దుర్వినియోగం, రాజకీయ ఒత్తిడి లకి తలొగ్గిన కలెక్టర్ వీర పాండ్యన్, జిల్లా ఎస్ పి ఫకీరప్ప ల వైఖరి, తన మామ గారు కరోనా కారణంగా మరణించినా, ఆ విషయాన్ని దాచిపెట్టారని అభియోగాలు ఎదుర్కుంటున్న కృష్ణ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ధోరణి రాష్ట్ర ప్రభుత్వ 'మత' సంతుష్ట రాజకీయాలకు అడ్డం పడుతోందనే భావన బలీయంగా వ్యక్తమవుతోంది. కర్నూల్ లోకల్ ఎం ఎల్ ఏ హఫీజ్ ఖాన్ మర్కజ్ నుండి వచ్చిన వాళ్ళని గుర్తించకుండా, మర్కజ్ నుండి వచ్చిన వాళ్ళని కలిసిన వాళ్ళని గుర్తించనివ్వకుండా తన అధికారాన్ని అడ్డుపెట్టి 15 రోజుల క్రితం చేసిన తప్పులు నెమ్మదిగా ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి. ప్రవేట్ డాక్టర్ లు ఓ పి లు చూడకూడదు అని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, ఎం ఎల్ ఏ హఫీజ్ ఖాన్ తెలిసిన వ్యక్తి కావడం తో కర్నూల్ లో ప్రముఖ గుండె జబ్బుల వైద్యుడు ఇస్మాయిల్ హుస్సేన్ , కె ఎం ప్రయివేట్ హాస్పిటల్ అధినేత ఈ నెల 10 వరకు ఓ పి చూశారు, 14 న కరోనా తో మరణించారు. సుమారు ఆయన 15 రోజుల పాటు 4 వేల మందికి పైగా వైద్యం చేశారు .
స్థానికుల అనుమానం ప్రకారం మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని రహస్యంగా ట్రీట్మెంట్ చేయడం ద్వారా నే ఈయన కి కరోనా వచ్చినదని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. అంటే మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని దాచడం, వాళ్ళు అక్కడి మసీదులో ఉన్నారని పోస్ట్ పెట్టిన వాళ్లపై తప్పుడు కేసు పెట్టడం, మర్కజ్ వెళ్లిన వాళ్ళ వివరాలు బయటకు రాకుండా వాళ్ళకి రహస్యంగా హఫీజ్ ఖాన్ నే తనకు తెలిసిన ఇస్మాయిల్ అనే డాక్టర్ తో ట్రీట్మెంట్ చేయించాడేమో అనే అనుమానాలు స్థానిక ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. అంతే కాదు ఆ ప్రముఖ డాక్టర్ విజయవాడ కలెక్టర్ ఇంతియాజ్ కి స్వయానా మామ గారు. కర్నూల్ లో కోవిడ్ టెస్ట్ ల్యాబ్ పెట్టినా ఇప్పటివరకు దానిలో ఒక్క టెస్ట్ కూడా జరగలేదు , టెక్నీషియన్ రాలేదు.కానీ ఇస్మాయిల్ హుస్సేన్ అనే డాక్టర్ కి మాత్రం 11 వ తారీఖు న కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. అదే శాంపిల్ ని మళ్ళీ హైదరాబాద్ పంపిస్తే కరోనా పాజిటివ్ వచ్చింది. కర్నూల్ కలెక్టర్, ఎస్ పి , ఎం ఎల్ ఏ లు తమకు తాముగా తీసుకున్న నిర్ణయం వల్లనా, లేక, ప్రభుత్వం లోని కొందరి పెద్దల ఒత్తిడి కారణంగా ఆ నిర్ణయాలు తీసుకున్నారా, అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.