కుప్పం లో చంద్ర బాబు, వై ఎస్ భారతి ?
posted on Dec 11, 2012 @ 1:10PM
వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గంలో చంద్ర బాబు కు పోటీగా, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతిని పోటీకి దింపాలని ఆ పార్టీ భావిస్తోందని మీడియాలో కధనాలు వస్తున్నాయి. ఒక వేళ అదే నిజం అయితే, ఇది ఆసక్తిదాయకమైన పోటీగానే ఉంటుంది.
బాబు 1989 నుండి ఇక్కడ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆయనకు దీటుగా అభ్యర్ధిని నిలపడం ఇంత వరకూ కాంగ్రెస్ పార్టీకి సాధ్యపడలేదు.
ఇక్కడ భారతి బాబుఫై ఘన విజయం సాధిస్తారని ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేనప్పటికీ, ఆ పార్టీ నేతల ఆలోచన మరోలా ఉంది. అయితే, భారతి ఒక వేళ విజయం సాధిస్తే, అది తెలుగు దేశం పార్టీ పతనానికి నాంది అవుతుంది. ఒక వేళ ఆమె ఓడిపోయినా, ఓడిపోయింది మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చేతిలో కావడంతో పెద్దగా ఆ విషయానికి ప్రాముఖ్యత ఉండకపోవచ్చు.
ఒక వేళ భారతి ఇక్కడ నుండి పోటీ చేయడం ఖరారు అయితే, విజయమ్మ, షర్మిలా కుప్పంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.