రాజకీయాల నుండి దాసరి రిటైర్మెంట్ ?
posted on Dec 11, 2012 @ 12:45PM
మాజీ కేంద్ర మంత్రి, సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు దాసరి నారాయణ రావు రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 65 సంవత్సరాల దాసరి కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రిగా కూడా పని చేశారు.
ఇక తాను రాజకీయాల్లో రాణించే అవకాశం లేదనే తుది నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. ఒక దశలో జగన్ పార్టీ వైపు తన దృష్టి సారించినప్పటికీ, చివరికి ఆ ఆలోచనను కూడా విరమించుకున్నట్లు తెలుస్తోంది. దాసరి ఆకస్మిక నిర్ణయానికి కారణాలేమిటో మాత్రం తెలియ రాలేదు. బహుశా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే విషయంలో ఆయనకు స్పష్టమైన హామీ ఇచ్చి ఉండక పోవడమే ఆయన నిర్ణయానికి కారణం కావచ్చు.
దాదాపు 140 సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు, మోహన్ బాబు, ఆర్. నారాయణ మూర్తి,ముత్యాల సుబ్బయ్య వంటి వ్యక్తులను సిని పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత కూడా దక్కించుకున్నారు.