కౌన్ బనేగా కరోడ్ పతిలో ప్రశ్నగా కేటీఆర్ ట్వీట్..
posted on Sep 4, 2021 @ 12:07PM
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణా ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆసక్తికరంగా వార్తల్లో నిలిచారు. పాపులర్ రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్ పతిలో అనూహ్యంగా చోటు సంపాదించుకున్నారు. అయితే ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. విభిన్న అంశాలపై స్పందించే కేటీఆర్ ట్వీట్ కేబీసీలో ఒక ప్రశ్నగా వచ్చింది.
కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్ పతి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఎందరో హాజరయ్యారు. తాజాగా భారత మాజీ క్రికెటర్స్ వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ హాజరయ్యారు. వీరికి అమితాబ్.. కేటీఆర్ గతంలో చేసిన ట్వీట్‌ని ప్రశ్నగా అడిగారు.
కోవిడ్ బాధితులు, ఇతర సమస్యలపై సోషల్ మీడియా ద్వారా వేగంగా స్పందించారు కేటీఆర్. కొద్ది రోజుల క్రితం కరోనా చికిత్సలో ఉపయోగించే మెడిసిన్ లిస్ట్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ గతంలో ట్వీట్ చేశారు. వీటిని సరిగ్గా పలికే వారున్నారా ? అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు దీని వెనుక ఖచ్చితంగా ఈయన హస్తం ఉండే ఉంటుదని చమత్కరిస్తూ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి ధరూర్‌ని ట్యాగ్ చేశారు. ఆ ట్వీటే కేబీసీలో ప్రశ్నగా మారింది.
తెలంగాణ మంత్రి కేటీఆర్ వీరిలో ఎవరికి ట్యాగ్ చేశారంటూ ప్రశ్నిస్తూ.. నాలుగురి పేర్లను ఆప్షన్స్‌గా ఇచ్చారు అమితాబ్ . అందులో ఒకరు సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యన్ స్వామి, అమితావ్ గోష్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆప్షన్స్ ఇచ్చారు. దీనిపై సౌరవ్ గంగూలీ తెలివిగా శశి థరూర్ అని చెప్పారు. ఆయనకు ఇంగ్లీష్‌పై పట్టు బాగా ఉంటుంది. అందుకే ఆయన పేరు గెస్ చేసి చెప్పాను అని సౌరవ్ గంగూలీ అన్నారు.
తను చేసిన ట్వీట్ కేబీసీ తాజా ఎపిసోడ్‌లో ప్రశ్నగా రావడంతో కేటీఆర్ ఆశ్చర్యపోయారు. ఏదో సరదాగా చేసిన ట్వీట్ ఇలా కేబీసీలో రావడం సతోషంగా ఉందని చెప్పారు. దాదా, సెహ్వాగ్ ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెబుతారని అనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. దీంతో కేటీఆర్ ట్వీట్ తెగ వైరల్‌గా మారింది.