నోట్ల కట్టలతో దొరికినోడు నీతులా.. రేవంత్ కు కేటీఆర్ కౌంటర్
posted on Jul 8, 2021 @ 3:07PM
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన సభలోనే కేసీఆర్ పై విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. కరోనా కంటే కేసీఆర్ ప్రమాదకరమని కామెంట్ చేశారు. దొర పాలనను అంతం చేస్తామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్. కెసిఆర్ అనే మహానేత నడుస్తుంటే కొంత మంది బిచ్చగాళ్ళు మొరుగుతున్నారని కామెంట్ చేశారు. అధికారాన్ని గుంజుకుంటామంటూ..కెసిఆర్ ను తిట్టి శునకానందం పొందుతున్నారని విమర్శించారు. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ ల కోసం కెసిఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ఇక్కడ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు సీఎం గా ఉన్నారనే విషయం మరచిపోవద్దని కేటీఆర్ సూచించారు. కెసిఆర్ ను ఎదుర్కోవాలంటే కెసిఆర్ కంటే ఎక్కువగా తెలంగాణ ను ప్రేమించగలగాలన్నారు. డైలాగ్ లు కొడితే కెసిఆర్ ను కొట్టలేరన్నారు కేటీఆర్. దుబ్బాక విజయం తో ఎగిరెగిరి పడిన బీజేపీ.. నాగార్జున సాగర్ లో డిపాజిట్ కోల్పోయిందన్నారు కేటీఆర్. 77 నియోజకవర్గాల పరిధి లో జరిగిన రెండు ఎమ్మెల్సీ సీట్లను టీఆర్ఎస్ గెలిచిందన్నారు. కెసిఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు కేటీఆర్.
కొందరు పాదయాత్రలు చేస్తామని అంటున్నారు.. వారికి శుభాకాంక్షలు .కరోనా తర్వాత ఆరోగ్యమైనా కుదుట పడుతుందంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. పాదయాత్ర చేస్తే నైనా పల్లెలు టీ ఆర్ ఎస్ ప్రభుత్వ హాయం లో అభివృద్ధి చెందిన విషయం తెలుస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంతటి అభివృద్ధి ఉందా పాదయాత్ర చేసే నేతకు కనిపిస్తుందని కామెంట్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు రైతు బంధు అమలు చేస్తున్నాయా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ,పాలమూరు ప్రాజెక్టు లకు బీజేపీ జాతీయ హోదా ఎందుకు ఇవ్వదని కేటీఆర్ నిలదీశారు.
గతంలో సోనియాను బలి దేవత అన్న కొత్త పీసీసీ అధ్యక్షుడు.. ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నారని కేటీఆర్ అన్నారు. రేపు చంద్రబాబు ను తెలంగాణ తండ్రి అన్నా అంటారన్నారు. రేవంత్ కు టీడీపీ పాత వాసనలు పోలేదన్న కేటీఆర్.. టీపీసీసీ కాదు తెలుగుదేశం కాంగ్రెస్ అని హస్తం నేతలే అంటున్నారని చెప్పారు. నోట్ల కట్టలతో దొరికినోడు నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు. పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టాలంటున్న నేత కూడా పార్టీ మారాడా కదా.. మరీ ఆయన్ను ఏ రాయితో కొట్టాలని కేటీఆర్ ప్రశ్నించారు..రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ కూడా అదే చేశారు ?ఆయన్ను కూడా రాయితో కొట్టాలా ? అన్నారు కేటీఆర్. చిన్న పదవి రాగానే పీఎం పదవి వచ్చినట్టు బిల్డ్ అప్ ఇస్తున్నారని విమర్శించారు. కొత్త సినిమా విడుదలైనప్పుడు ఆగమాగం బ్యాచ్ లా ఉంది రేవంత్ తీరు ఉందన్నారు.బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోవాలని కేటీఆర్ సూచించారు