కేటీఆర్‌కు వెన్ను పూసలో గాయం.. కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరం
posted on Apr 28, 2025 @ 9:20PM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్ వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో ఆయన కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ఎక్స్ వేదికగా అభిమానులకు, బీఆర్‌ఎస్ శ్రేయోభిలాషులకు తెలియజేశారు. అంతేగాక త్వరలోనే తన పాదాలపై తాను నడుచుకుంటూ వస్తానని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ లో.. జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా వెన్నుపూసలో సమస్య తలెత్తిందని తెలిపారు. దీంతో వైద్యులను సంప్రదించగా.. కోలుకునేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందని, అప్పటివరకు బెడ్ రెస్ట్ అవసరం అని సూచించినట్లు చెప్పారు. నిన్న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్‌ఎస్ శ్రేణులు కామెంట్లు చేస్తున్నారు