బాలకృష్ణకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
posted on Apr 28, 2025 @ 8:34PM
ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.‘‘గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న ప్రముఖ సినీనటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు నా అభినందనలు. కళా, సేవా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య మరిన్ని నూతన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయనపై సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభినందనలు చెబుతున్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్లు చేస్తున్నారు.