రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంటకసత్యనారాయణ.. విధేయత, సీనియారిటీకే పెద్దపీట
posted on Apr 28, 2025 @ 10:39PM
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన సీనియర్ నేత పాక వెంకటసత్యనారాయణ ఖరారయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. బీజేపీతో పాకా సత్యనారాయణకు నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది.ఆర్ఎ్ఎస్ నేపథ్యం ఉన్న పాక సత్యనారాయణ బీజేపీలో వివిధ స్థాయిలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నేపథ్యం కలిగిన ఆయన, పార్టీలో వివిధ స్థాయిల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి, ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్థిత్వం కోసం పార్టీ సీరియస్ గా పరిశీలనకు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.
పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం చెందిన బిజెపి సీనియర్ నాయకుడైన పాక వెంకటసత్యనారాయణ ప్రస్తుతం ఆయన బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పాక్ వెంకటసత్యనారాయణ గోదావరి జిల్లాల్లో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై, మాజీ కేంద్ర మంత్రి అరుణా ఇరానీ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే బీజేపీ సోమవారం అధికారికంగా పాక వెంకటసత్యనారాయణ పేరు ప్రకటించడంతో ఆ వార్తలన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన పాక వెంకటసత్యనారాయణ బీసీ వర్గానికి చెందిన నాయకుడు. మంచి వక్త. వివాదరహితుడు. పార్టీకి నాలుగు దశాబ్దాలుగా అంకిత భావంతో పని చేస్తున్నారు. వెంకటసత్యనారాయణను రాజ్యసభ సభ్యత్వం దక్కడం పట్ల బీజేపీ రాష్ట్రనాయకులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
బీజేపీ ఏపీ కోర్ కమిటీ సోమవారం (ఏప్రిల్ 28) సమావేశమై బీజేపీ అభ్యర్థిపై చర్చించింది. పలువురి పేర్లను పరిశీలించిన తరువాత పాక వెంకటసత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసి అధిష్ఠానానికి పంపింది. ఈ కోర్ కమిటీ సమావేశంలో యూరప్ పర్యటనలో ఉన్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ పాక్ వెంకటసత్యనారాయణ పేరును అధిష్ఠానానికి పంపింది. మరో ఆలోచన లేకుండా పార్టీ హైకమాండ్ కూడా ఆ పేరునే ఖరారు చేసి ప్రకటించింది. పాక్ వెంకటసత్యనారాయణ మంగళవారం (ఏప్రిల్ 29)న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
వాస్తవానికి, ఈ రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ వంటి పలువురి పేర్లు గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించి, కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలన్నింటినీ పక్కన పెట్టి, పార్టీకి మొదటి నుంచి సేవలందిస్తున్న రాష్ట్ర నేతకే అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది.
అత్యంత సామాన్య కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో పనిచేసిన పాకా సత్యనారాయణకు అనూహ్యంగా రాజ్యసభ అవకాశం దక్కడంతో పార్టీ శ్రేణుల్లోనూ ఆసక్తి నెలకొంది. అధిష్ఠానం నిర్ణయం వెలువడిన వెంటనే పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయను న్నారు.