పరుగుపందెంలో గెలిచి జీవితం లో ఓడిన అభాగ్యుడు
posted on Oct 17, 2012 @ 11:29AM
సామాన్య జీవితం అతనిది తల్లిదండ్రులు పేదవారు. దాంతో ఎలాగైనా మెరుగైన జీవితం కావాలనుకున్నాడు. దాంతో సౌత్ సెంట్రల్ రైల్యేలో ఉద్యోగం కోసం ఎంతో శ్రమ కోర్చి వ్యయ ప్రయాసలతో శ్రీకాకుళం లోని పాతపట్నం మండలంలోని చిన్న పల్లెనుండి వచ్చిఅన్ని టెస్టులను గెలచి చివరిగా 1,500 మీటర్ల దూరాన్ని ఇచ్చిన గడువులో పరుగెత్తి తన సత్తాచాటుకున్నాడు. జీవితంలో ఇక ఓటమే లేదనుకుని సహచరులందరితో సంతోషాన్ని పంచుకున్నాడు. అయితే ఇది జరిగిన కొద్దిసేపటికే ఊపిరి పీల్చుకోవడం కష్టమై ఆసుపత్రికి తీసుకెళుతుండగానే చనిపోయిన అభాగ్యుడు కొరిచెడ ఫల్గుణరావు. ఇలాంటి మరణం ఫల్గుణరావుతోనే మొదలవ్వలేదు. ఏ పరుగుపందెం జరిగినా ఎక్కడ కానిస్టేబుల్ లేదా ఛెందిన పరుగు పందేలు జరిగినా ఎంతో మంది దిగువ మద్యతరగతి యువకులు మరణించడం మామూలయిపోయింది. దీన్ని ప్రశ్నించే వారే లేరు. చాలీ చాలని కూలీలతో సరైన పోషకాహారం లేక, సుదూర ప్రాంతాలనుండి ముందేవచ్చి పేవ్ మెంట్ల మీద పడుకొని దోమలతో చలితో సహజీ వనం చేసి నిద్రలేని రాత్రుళ్లు గడిపి తెల్లారే లేచి ఏ రోడ్ సైడ్ బండిమీద టిఫిన్ చేశామనిపించి పరుగుపందెంలో ప్రాణాలు పోగుట్టుకున్నవారు ఎందరో.........దీనికి భాద్యులెవరు చెట్టంత ఎదిగిన కొడుకు చేతికందివస్తాడనుకుంటే శాశ్వతంగా దూరమై కుమిలిపోతున్న తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెబుతారు పాలకులు, అధికారులు, నిర్లక్ష్యానికి పరాకాష్టకు ఇది అద్దం పట్టండం లేదా సరైన సదుపాయాలు లేకుండా పోటీలు పెట్టి , వస్తున్న అభ్యర్ధులకు కనీసం టెంట్ సదుపాయాలు కూడా లేకుండా ప్రాణాలతో చెలగాటం ఆడే అధికారుల్ని ఉపేకించకూడదని ఇప్పటికైనా ప్రజాసంఘాలు, మేధావులు మేల్కొనాలని ఫల్గుణరావు కుటుంబసభ్యులు, బంధు మిత్రులు కోరుకుంటున్నారు. ,