కొండా లక్ష్మణ్ దీక్షకు టిజెఎస్సి మద్దతు
posted on Nov 3, 2011 8:30AM
న్యూఢిల్లీ: తెలంగాణ కోసం దీక్ష చేస్తున్న స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీకి తెలంగాణ సంయుక్త పోరాట కమిటీ(టిజెఎస్సి) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పలువురు టిజెఎస్సి నేతలు ఇక్కడికి వచ్చి ఆయనకు మద్దతు పలికారు. తెలంగాణలోని రాజకీయ పార్టీల నేతలు తమ స్వార్ధాన్ని విడిచి లక్ష్మణ్ బాపూజీ నాయకత్వాన్ని బలపరిచి, ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.