జానారెడ్డిపై కోదండరామ్ నిప్పులు
posted on Nov 3, 2011 8:26AM
హైదరాబాద్: రాష్ట్రమంత్రి జానారెడ్డిపై తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం మంత్రిపదవికి రాజీనామా చేయమని రాష్ట్రమంత్రి జానారెడ్డిని ఎంత బతిమాలినా చేయలేదనీ, ఆయనకు తెలంగాణ కంటే మంత్రి పదవే ముఖ్యమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తే ఎప్పుడో తెలంగాణ వచ్చి ఉండేదన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఆ పని చేయడం లేదన్నారు. తెలంగాణ వచ్చేవరకూ ఉద్యమం సాగుతుందనీ, కాకపోతే ఉద్యమం స్వరూపం మార్చి ముందుకు సాగుతామని తెలిపారు.