ఎకరాకు 60 కోట్లు.. కోకాపేట భూముల వేలంలో రికార్డ్
posted on Jul 15, 2021 @ 8:51PM
తెలంగాణ ప్రభుత్వం భూముల వేలం లో రికార్డు సృష్టించింది. హైదరాబాదు శివారు ప్రాంతం కోకాపేటలోని ప్రభుత్వ భూములను వేలం వేయగా భారీ స్పందన వచ్చింది. ఎకరం ధర గరిష్టంగా 60 కోట్లు పలికింది. కోకాపేటలో నియో పోలీస్ పేరుతో హెచ్ఎండీఏ రూపొందించిన లే అవుట్ లో ని ఫ్లాట్ కి ఆన్లైన్ వేలం నిర్వహించారు. ఇందులో దాదాపు యాభై ఎకరాలను విక్రయించగా రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఒక్కో ఎకరం దర రూ 60 కోట్లకు పైగా ధర పలకడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి.
ప్లాట్ నెంబర్ ఒకటిలో 7.721 ఎకరాలు .... ఇందులో ఒక ఎకరం ధర 42.2 కోట్లు కాగా మొత్తం 325.8 మూడు కోట్లు ధర పలికింది. దీనిని మన్నె సత్యనారాయణ రెడ్డి కొనుగోలు చేశారు. రెండవ నెంబర్ ప్లాట్ లో 7.755ఎకరాలు... ఒక ఎకరం ధర 42.4 కోట్లు కాగా మొత్తం 328.81 కోట్ల రూపాయలు వెచ్చించి రాజ పుష్ప పి పి ఎల్ సంస్థ కొనుగోలు చేసింది. మూడవ ప్లాట్ 7.738ఎకరాలు..., ఒక ఎకరం ధర 36.4 కోట్లు ధర పలకగా మొత్తం 281.16 కోట్లకు ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. 12వ ప్లాట్ విస్తీర్ణం 7.564ఎకరాలు.. ఒక ఎకరం ధర 37.8 కోట్లు పలక మొత్తం 285.92 కోట్లకు ప్రెస్టేజ్ ఏస్టేట్స్ ప్రాజెక్టు లిమిటెడ్ కొనుగోలు చేసింది. నాలుగు ప్లాట్స్ లోని 30.77 ఎకరాలకు 1222 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది
ప్లాట్ 4లో 8.946ఎకరాలు.. 39.2 కోట్ల రూపాయలకు ఒక ఎకరం చొప్పున 350.68 కోట్లకు ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకోగా.. ప్లాట్ నెంబర్ 13లో 7.575ఎకరాలు..ఎకరం ధర 39.2 కోట్ల చొప్పున 296.94 కోట్లకు వర్సిటీ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ప్లాట్ A ఒకఎకరం.. ఒక ఎకరం 31.2 కోట్ల చొప్పున హేమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. గోల్డెన్ మైల్ సైట్ 1లోని ప్లాట్ నెంబర్ 2/పి లో 1.650 ఎకరాలు... ఈ ఫ్లాట్ అత్యధికంగా 60.2 కోట్ల చొప్పున 99.33 కోట్లకు రాజ పుష్ప రియాలిటీ llp కొనుగోలు చేసింది.
ఈ భూముల వేలానికి గత సంవత్సరం నుంచి హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సన్నాహాలు చేస్తోంది. నియో పోలిస్ వెంచర్ లోని 49.92 ఎకరాలను ఎమ్మెస్టీసీ వెబ్ సైట్ ద్వారా వేలం వేసింది. ఎకరం కనీస ధరను ప్రభుత్వం రూ.25 కోట్లు అని ప్రకటించగా, దాదాపు అందుకు రెట్టింపు ధర లభించడం విశేషం. కోకాపేటలో నేడు వేలం వేసిన భూములు అవుటర్ రింగురోడ్డు పక్కనే ఉండడమే అందుకు కారణం. కాగా ఈ వెంచర్ కు చేరుకునేందుకు ట్రాఫిక్ సమస్యలు ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేకంగా రహదారులు నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో, రియల్ వ్యాపారులు భారీగా వేలం పాటలో పాల్గొన్నారు. గతంలో ఇక్కడ కొన్ని భూములను వేలంగా వేయగా గరిష్ఠంగా రూ.40 కోట్ల వరకు ధర పలకగా, ఈసారి అంతకు మించిన ధర పలికింది. కొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా వేలంలో పాల్గొంటున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. మిగిలిన భూములకు కూడా ఇదే ధర వెళుతుందని భావిస్తున్నారు.