తెలంగాణా తీర్మానం సాధ్యం కాదు: సీఎం
posted on Sep 17, 2012 @ 6:52PM
తెలంగాణాపై అసెంబ్లీలో తీర్మానం చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ప్రాంతాలవారీగా విడిపోయారని, ఈ పరిస్థితులలో శాసనసభ తీర్మానం చేయడం సాథ్యం కాదని చెప్పారు. తెలంగాణాపై తీర్మానం చేస్తే తెలంగాణ ఆకాంక్షకే నష్టం వాటిల్లుతుందని అన్నారు. రాష్ట్ర విభజన అంశం చాలా సున్నితమైనదని తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని చెప్పారు. పునరుద్ఘాటిస్తూ త్వరలో హైదరాబాద్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన జీవ వైవిధ్య సదస్సు జరగనున్న దృష్ట్యా సెప్టెంబర్ 30 వ తేదీన నిర్వహించద లపెట్టిన తెలంగాణా మార్చ్‌ను ఉపసంహరించుకోవాలని అన్నారు.