కోదండరామ్ వ్యాఖ్యలపై టి కాంగ్రెస్ నేతల ఆగ్రహం
posted on Sep 17, 2012 @ 8:17PM
మంత్రి శ్రీధర్ బాబుపై తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయ్. ఆగ్రహావేశాలతో ఊగిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు కోదండరామ్ ఇంటిని ముట్టడించారు. కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యుఐ కార్యకర్తలు ఉస్మానియాలో కోదండరామ్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఆయనపై వెంటనే పోలీస్ కేసు పెట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కోదండరాం చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏదైనా జరిగితే కోదండరాందే బాధ్యతని జగ్గారెడ్డి హెచ్చరించారు. కోదండరామ్ వెంటనే శ్రీథర్ బాబుకి క్షమాపణ చెప్పాలని మంత్రి సారయ్య వ్యాఖ్యానించారు. తక్షణం కోదండరామ్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ మార్చ్ పూర్తిగా విఫలమౌతుందని మాజీ మంత్రి జానారెడ్డి హెచ్చరించారు. మంత్రి శ్రీథర్ బాబుపై కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు మొత్తం కాంగ్రెస్ నేతల్లో కదలికను తెప్పించాయి.