ఢిల్లీ అల్లర్లకు సోషల్ మీడియా కారణమ‌ట‌!

అల్లర్లపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని.. ఎన్ని జరిగినా సీఏఏ ఎన్నార్సీలను అమలు చేస్తామంటున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. పక్క దేశాల్లోనే మైనార్టీ హిందువులకు భారత పౌరసత్వం ఇస్తామని స్పష్టం చేశారు.

ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. గచ్చిబౌలిలోని ఐఎస్బీలో ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభించిన కిషన్ రెడ్డి మాట్లాడారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలే ఢిల్లీ అల్లర్లకు అసలు కారణమని అన్నారు. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ధోరణియే అల్లర్లకు కారణమవుతున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

బీజేపీ నేతలైన కపిల్ మిశ్రా సహా బీజేపీ నేతల ప్రసంగాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత బీజేపీ నేతలనే తప్పుపట్టిన కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమయ్యాయి. ఢిల్లీ అల్లర్లలో పోలీస్ అధికారులను కూడా ఆందోళనకారులు కిరాతకంగా చంపారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

Teluguone gnews banner