విజృంభిస్తున్న మంకీ ఫీవర్!
posted on Mar 2, 2020 @ 11:17AM
కరోనా(కోవిడ్)వైరస్ గురించి భయపడుతున్న సమయంలో కర్ణాటకలో మరో రోగం విజృభిస్తుంది. మంకీ ఫీవర్ గా కూడా పిలిచే కైసనూర్ ఫారెస్ట్ డిసీస్(KSD)ఇప్పుడు కర్ణాటకలో విజృంభిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో ఈ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నెల రోజుల క్రితం శివమొగ్గకు చెందిన ఓ 58ఏళ్ల మహిళ ఈ వ్యాధికి బలైంది. ఈ ఘటన మరిచేలోపే ఈ రోగం మరో ప్రాణాన్ని బలిగొంది. ఉత్తర కన్నడ జిల్లాలోని సిద్దపూర తాలూకాకు చెందిన 64 ఏళ్ల భాస్కర్ గణపతి హెగ్దే ఈ మంకీ ఫీవర్ తో ప్రాణాలు కోల్పోయాడు.
మణిపాల్లోని ఓ హాస్పిటల్ కి తరలిస్తుండగా మధ్యలోనే భాస్కర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ వ్యాధి ఇక్కడ బాగా ప్రబలుతోంది. ఒక్క శివమొగ్గలోనే 55మంది ఈ వ్యాధి బారినపడ్డారు. వీరిలో 22మందికి వ్యాక్సీన్లు వేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికీ సూచనలిస్తున్నట్లు మెడికల్ అధికారి ఒకరు చెప్పారు.