విదేశాలకు రేషన్ బియ్యం!
posted on Mar 2, 2020 @ 10:59AM
విజిలెన్స్ అధికారులు దాడులతో ఈ బండారం బట్టబయలైంది.
1,645 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్
ఈ బియ్యం విలువ రూ.546 కోట్లు
ప్రభుత్వం పేదల కోసం కోట్లు ఖర్చు పెట్టి రూ.1కే కిలోబియ్యం అందిస్తోంది. అయితే దొడ్డుగా ఉండే ఈ బియ్యాన్ని పేదలు తినడం లేదు. సన్నిబియ్యం తిండికి అలవాటు పడడంతో ప్రభుత్వం అందించే దొడ్డు రేషన్ బియ్యాన్ని ఎవరూ తినడం లేదు.దీంతో ఈ బియ్యం దళారులు వ్యాపారుల ద్వారా ఇతర రాష్ట్రాలకు దేశాలకు గుట్టుచప్పుడు కాకుండా ఎగుమతి అవుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే రేషన్ బియ్యం యథేచ్ఛగా విదేశాలకు తరలిపోతుంది.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ల రవాణా కేంద్రంగా వ్యవహరించే సీబర్డ్ కంపెనీ గోదాముల్లో విజిలెన్స్, సివిల్ సప్లయ్స్, కస్టమ్స్ అధికారులు విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్న 1,645 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. వీటి విలువ రూ.546 కోట్లు అని తేల్చారు.
ఈ బియ్యా న్ని 5 బ్రాండ్ల పేరుతో 25కిలోల ప్లాస్టిక్ సంచుల్లో సిద్ధం చేసి ఉంచారు. సీబర్డ్ కంపెనీ ద్వారా కస్టమ్స్ అనుమతులు లభిస్తే, కంటైనర్ల ద్వారా ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
విజయవాడ, కాకినాడ, గుంటూరు జిల్లాలతో పాటు చెన్నై, కర్ణాటక నుంచి ఈ బియ్యాన్ని సీబర్డ్ గోదాములకు తరలించినట్లు గుర్తించారు.