అర్ధరాత్రి అహ్మద్ పటేల్ తో కిరణ్ భేటీ
posted on Aug 24, 2012 @ 10:16AM
గురువారం అర్థరాత్రి సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ నుంచి అర్జంటుగా రండి అని పిలుపు వచ్చింది.అంతే కిరణ్ ఏపీ భవన్‌లోని తన అతిథి గృహం నుంచి హుటాహుటిన అహ్మద్ పటేల్ వద్దకు బయలుదేరారు. వారిద్దరి మధ్య భేటీలో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్నది మాత్రం తెలియరాలేదు. గురువారం ఉదయం అహ్మద్ పటేల్‌తో కిరణ్ సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఒకవైపు ధర్మాన రాజీనామా వ్యవహారం, మరోవైపు నాయకత్వ మార్పులపై ఊహాగానాల నేపథ్యంలో కిరణ్‌కు అర్ధరాత్రి అనూహ్యంగా మరోసారి అహ్మద్ పటేల్ నుంచి పిలుపు అందడం గమనార్హం.