మంత్రి పార్థసారధికి చుక్కెదురు
posted on Aug 23, 2012 @ 3:45PM
మంత్రి పార్థసారధికి చెందినా కెపిఆర్ టెలీ ప్రాడక్ట్స్ లిమిటెడ్ ఫేరా నిబంధనలను ఉల్లంఘించారని ఎక్సైజ్ మరియు సెకండరీ విద్యాశాఖ మంత్రి పార్థసారథిపై ఆర్ధిక నేరాల సెషన్స్ కోర్టు విధించిన శిక్ష విదితమే. బుధవారం పార్థసారథి తనకు శిక్ష విధిస్తూ ఆర్ధిక నేరాల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. మంత్రి పార్థసారథి తరపున లాయర్ పద్మనాభరెడ్డి వాదిస్తూ 1994లో ఫేరా నిబంధనలను ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. కానీ కెపిఆర్ సంస్థ విదేశీ మిషనరీ కోసం రూ.69 లక్షలు చెల్లించిన పిదప మిగిలిన సొమ్మును చెల్లించలేక విదేశాలనుంచి మిషనరీ దిగుమతి చేసుకోలేదని కోర్టుకు విన్నవించారు. ఈ విషయంలో పార్థసారధి ఎటువంటి అవినీతికి గానీ, దురేద్దేశ పూర్వకంగా గానీ ఎటువంటి మోసాలకు పాల్పడలేదని కావున పార్థసారథికి విధించిన శిక్షను వెంటనే రద్దు చేయాలని కోరారు. అయితే ఈడీ తరపున న్యాయవాది పార్థసారథి రాజకీయ జీవితంపై ఈ కేసు ప్రభావం చూపుతుందనే కారణంతో కేసును కొట్టేయ కూడదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తన తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.