మరో పాదయాత్ర ...
posted on Oct 10, 2012 @ 4:47PM
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాటలో బిజీగా ఉండి ప్రజలతో మమేకమౌతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 117 రోజుల మీకోసం పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తమ ఉనికిని ఎక్కడ కోల్పోతామోనన్న ఉలికిపాటుతో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు నేడు సమావేశం అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన విషయం విదితమే. కానీ నేడు చంద్రబాబు రాయలసీమలో చేపట్టిన మీకోసం యాత్రకి వస్తున్న ప్రజాసందోహం చూసి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తాము కూడా ఏదో ఒక ప్రజాయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర జగన్ అరెస్టుతో ఆగిపోయింది. జగన్ అరెస్టుతో విజయమ్మ ఓదార్పు యాత్రను కొనసాగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తాజాగా వై.ఎస్.ఆర్. కుమార్తె జగన్ సోదరి షర్మిలతో పాదయాత్రలు కొనసాగించాలని నిర్ణయించారు. షర్మిల యాత్ర ఈ నెల పదిహేడో తేదీన కడపజిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభిస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.