కోలుకుంటున్న కేజ్రీవాల్
posted on Feb 15, 2015 @ 9:49PM
అనారోగ్యానికి గురైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోలుకుంటున్నారు. ఆయన గత ఐదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన తీవ్ర జ్వరానికి గురయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆయన 102 జ్వరంతో బాధపడుతున్నారు. ఆదివారం నాడు ఆయన కొంత కోలుకున్నట్టు తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ నిరంతరం అనారోగ్యానికి గురవుతూ వుంటారు. జ్వరం, జలుబు ఆయనను వేధిస్తూ వుంటాయి. అందుకే ఆయన తల చుట్టూ మఫ్లర్ కప్పుకుని కనిపిస్తూ వుంటారు. చివరకు ఆ మఫ్లర్ ఆయనకు ఒక గుర్తుగా మారిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా జ్వరంతో బాధపడుతూ వున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆయనకు జ్వరం వుంది. కేజ్రీవాల్ రెండు మూడు రోజుల్లో పూర్తి ఆరోగ్యం పొందే అవకాశం వుందని వైద్యులు చెబుతున్నారు.