వాద్రా అక్రమాస్తులపై వైసిపి ఎందుకు మౌనం.........
posted on Oct 13, 2012 @ 11:22AM
కేజ్రీవాల్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్టుడైన రాబర్ట్ వాద్రా పై అక్రమ ఆస్తుల వ్యవహారంలో సంచలన ఆరోపణలు చేయడమేకాకుండా ఆధారాలను కూడా చూపుతూ అవినీతిని అరికట్టాలంటూ దేశప్రజలను ఆకట్టుకుంటున్నారు. ప్రతిపకాలన్నీ దీనిపై గళం విప్పుతున్నాయి. అయితే వైసిపి మాత్రం దీనికి విరుద్దంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది కేవలం తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అనైతిక కుమ్మక్కేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ పై సిబిఐ తో సోనియా కుట్ర చేయిస్తున్నారన్న జగన్ వర్గం ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని వారు అడుగుతున్నారు. జగన్ సోదరి షర్మిల పాద యాత్ర ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒక విలేకరి ఇదే విషయాన్ని ప్రస్ధావిస్తే ఇప్సుడెందుకు ఆవిషయాలు అంటూ దాటవేయటం కాంగ్రెస్, వైసిపి కుమ్మక్కుకు అద్దం పడుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక వైసిపి నాయకులు కూడా తలలు పట్టుకుంటున్నారు.