చంద్రబాబునాయుడుకు స్వల్ప అస్వస్ధత
posted on Oct 13, 2012 @ 11:11AM
చంద్రబాబునాయుడు రోజూ కిలోమీటర్ల కొద్గీ నడవటం వల్ల స్వల్ప అస్వస్ధతకు గురి అవుతున్నారు. వస్తున్నా మీకోసం యాత్ర మొదలు పెట్టిన రోజే కాళ్లనెప్పులతో బాధపడ్డారు. దానికి గానూ ఫిజియోధెరపిస్టును అందుబాటులో ఉంచుకున్నారు. మూడురోజుల క్రితం అభిమానులు కురిపించిన బంతిపూల వానకు గానూ కళ్లలోకి పుప్పొడి వెళ్లి కళ్ళు ఎర్రగా మారి నీరు కారాయి. దీంతో ఆరోజు చంద్రబాబు కళ్ళపై కీర దోస ముక్కలు పెట్టుకొని స్వంత వైద్యం చేసుకొని రిలీఫ్ పొందారు. శుక్రవారం ఎండకు డిహైడ్రేషన్తో బాధ పడ్డారు. వికలాంగులతో మాట్లాడి లేవబోతూ నడుమునొప్పితో బాధపడ్డారు. వెంటనే వైద్యులు పెయిన్ కిల్లర్లు ఇచ్చి ఉపశమనం కలుగ ఛేశారు. ఫిజియోధెరపిస్టు సేవలను అందిస్తున్నారు. నిన్నటితో 200 కిమీ యాత్రను పూర్తిచేశారు. కాళ్లబొబ్బలు బాధపెడుతున్నాయి. రోజూ రాత్రిపూట కాళ్లను ఐసువాటరుపై పెట్టి ఉంచడం, మసాజ్ చేయించడం జరుగుతున్నాయి. వయసు, శారీరక బలహీనతలను కూడా లెక్క చేయకుండా 63 ఏళ్ల వయస్సులో ప్రజాయాత్రకు ప్రాధాన్యత నిచ్చి ప్రజలకు ఉత్సాహానివ్వండం పార్టీ వర్గాలను ఆనంద పెడుతున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. అరోగ్యకారణాల వల్ల చంద్రబాబు యాత్రను కొససాగించలేకపోయినట్లయితే కుమారుడు లోకేష్ యాత్రను కొనసాగిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.