తెలుగు తల్లిని దేయ్యమంటున్న కేసిఆర్
posted on Aug 7, 2012 @ 9:41AM
సీమాంధ్రులపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సభలోఆయన ప్రసంగించారు. తెలుగుతల్లి మా పాలిట దెయ్యమని, తెలుగుతల్లి మాకెలా తల్లి అవుతుందని అన్నారు. మా తెలంగాణ తల్లి మాకుందని అన్నారు. నన్నయ్య ఆదికవి కానేకాదని తేల్చిచెప్పారు. 'నన్నయ్య కవిత్వం రాయలేదు. సంస్కృతం లో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. ఆయన అనువాద కవి మాత్రమే. బసవ పురాణం రాసిన పాల్కురికి సోమనాథుడే ఆదికవి అని చెప్పారు.
జిల్లాలు, జనాభా ఎక్కువగా ఉన్న ఆంధ్రా ప్రాంతం కన్నా తెలంగాణ నుంచి ఎక్కువ ఆదాయం రావడం ఏమిటని నేను ప్రశ్నించాను. దీన్ని పరిశోధించమని చెప్పాను. చివరికి తేలింది ఏమంటే ఆంధ్రాలో పన్నుల ఎగవేత ఎక్కువ. వాళ్లు చట్టాలను ఉల్లంఘిస్తారు. అదే తెలంగాణ వాళ్లు నిజాయతీగా పన్నులు చెల్లిస్తారు. చట్టాలను గౌరవిస్తారు. తక్కువ జనాభా ఉన్నా తెలంగాణ నుంచే ఆదాయం ఎక్కువ అని వ్యాఖ్యానించారు.