చంద్రబాబుని చూసి కేసీఆర్,మోడీ భయపడుతున్నారు..!!
posted on Oct 4, 2018 @ 1:23PM
నిజామాబాద్ లో జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయి లో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ విమర్శలు తిప్పికొట్టారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటమి భయంతోనే కేసీఆర్ తెదేపాపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.కేసీఆర్ నిరాశ, నిస్పృహలతో చంద్రబాబుపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబును ఎంత తిడితే అన్ని ఓట్లు వస్తాయనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని.. తెలుగు ప్రజలంతా దీనిని నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ మరిచారా? అని ప్రశ్నించారు.రాజకీయ నేతగా ఎదిగిన కేసీఆర్,తెరాస మంత్రివర్గంలో ఉన్న సగంమంది తెదేపా గూటికి చెందిన వాళ్లేనన్న సత్యాన్ని ఆయన గ్రహించాలన్నారు.చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తే కేసీఆర్‌కు నష్టమే తప్ప లాభం ఉండదని తెలిపారు. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో ఎందుకు పొత్తుపెట్టుకున్నావని ఆయన ప్రశ్నించారు. సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబు అన్న మీరే ఇప్పుడు చంద్రబాబు తెలంగాణను నాశనం చేశారనడం బాధాకరమన్నారు. రూ.500 కోట్లు కాదు రూ.5 కోట్లు కూడా తెలంగాణకు పంపాల్సిన కర్మ పట్టలేదన్నారు. కేసీఆర్‌కు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని సోమిరెడ్డి అన్నారు.ప్రధాని మోదీ నుంచి కేసీఆర్ వరకు అందరికీ చంద్రబాబు భయం పట్టుకుందని విమర్శించారు.