ఆయన రూటే సెపరేటు..!
posted on Jun 8, 2022 @ 12:40PM
యుద్ధభయంతో వూళ్లు వదిలి పోయేవారుంటారు. ఉద్యోగాలకోసం వున్నవారు వదిలేసేవారుంటారు. ఉద్యో గంలో ప్రమోషన్ తప్పదుగనుక ఆ పరంగా వేరే ప్రాంతానికి వెళిపోతారు. కానీ తెలంగాణా ముఖ్య మంత్రి కేసి ఆర్ మాత్రం గజ్వేల్‌ను కేంద్రంలో చక్రం తిప్పాలని వదిలేసుకున్నారు. ఎప్పుడూ వున్న చోటేనే మరో ప్రాంతంలోనూ మన సత్తా చూపాలనుకున్నారు కేసీఆర్. పార్టీ పగ్గాలు కుమార రత్నం కేటీ ఆర్‌కి అప్పజెప్పి బిజెపి ప్రభుత్వాన్ని పనిగట్టుకుని తిట్టుకుంటున్నవారిని అందరినీ కలిసి కొత్త కూటమి గా ఏర్పాటుచేసి ఏకంగా ప్రధాని కావాలన్న కోరిక కేసీఆర్‌ను గజ్వేల్‌ని వొదిలేయ మంది. మనసు చెప్పిన మాట విని అనుసరించితీరాలిగదా!
కేసీఆర్ రాజకీయ జీవితంలో గజ్వేల్‌ది కీలకస్థానం. 2014 ఎన్నికల్లో కేసీఆర్‌కి సుమారు 87వేల ఓట్లు వేసి గజ్వేల్ ఓటర్లు గెలిపించారు. అలాగే 2018లో కేసిఆర్‌కు ఏకంగా లక్షా 25వేలకు పైగా ఓట్లు వేసి మరీ గెలి పించారు. రెండు పర్యాలు వంటేరు ప్రతాప్‌రెడ్డినే ఓడిం చేరు. మరి తనను ఇంతలా జనం ఆదరి స్తున్న గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు కేసీ ఆర్ ఎందుకు దూరం అవ్వాలనుకుంటున్నారనేది అక్కడి వారికి ఇంకా మింగుడుపడటం లేదు. కానీ కేసీఆర్ మాత్రం మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి పోటీచేయా లనుకుంటున్నారు. రెండుపర్యయాలు గజ్వేల్‌నుంచి గెలిచిన కేసీఆర్ మెదక్ నుంచీ పోటీ చేసి గజ్వేల్‌ని వంటేరు ప్రతాప్‌కి వదిలేస్తున్నాననీ అన్నారు. ప్రస్తుతం టిడిపిలో వున్న వంటేరుకు లైన్ క్లియర్ అయి నట్టే అనుకోవాలి.
ఇటీవలి కాలంలో మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా తెలంగాణా సీఎం కేంద్రంలో వున్నవారికి బుద్ధిచెప్పాలని గట్టి నిర్ణయానికి వచ్చేరు. వున్నచోటు నుంచే నలుగురి బలంతో యుద్ధంచేసేకంటే, తానే బిజెపి విపక్షాలను ఒక తాటి మీదకి తేవాలని బాగా ఆలోచించుకుని మరీ ఈమధ్య పర్యటనలు చేశారు. కేజ్రీవాల్, మాయావతిలను కలిసి తామంతా కలిస్తేనే, ఒక మాట అనుకుంటేనే బిజెపికి బుద్ధి చెప్పగల మన్న గొప్ప సూక్తి వినిపిం చేరు.
వారికి అనాదిగా వున్న ఆలోచననే ఈయన మళ్లీ నొక్కి వొక్కాణించేరు. తెలంగాణా పోరాటగడ్డ గనుక ఆ స్ఫూర్తిని ఇతర రాష్ట్రాల్లోని బిజెపి వ్యతిరేకులకు నూరిపోసి అందరికి నాయకుడయి కేంద్రంలో అలజడి తేవాలని వేసిన పథకం పారలేదు.
భారీ యత్నం దెబ్బతిన్న దిగులు కమ్మేసింది కేసీఆర్‌ను. దీనికి తోడు ఈమధ్య ప్రజలనుంచి కేసిఆర్ ప్రభుత్వ వ్యతిరేకత బాగా కనపడుతోంది. తొలినాళ్లకీ ఇప్పటికీ ఆయన పాలనావిధానంలో, పాలనాపర నిర్ణ యాల్లోనూ ఎంతో మార్పు వచ్చింది. అంతా దబాయింపు, దేనికీ సరయిన సమాధానం ఇవ్వకపోవడం, సవాల్ చేయడం కేసీఆర్ ప్రభుత్వం కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. పథకాల అమలు అద్భుతంగా వుంద ని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో కంటే ఇక్కడే పథకాల లబ్ధి పొందుతున్నవారి శాతం బాగా వుందని ప్రచారం చేస్తున్నారు.
వాస్తవంలో అంత గొప్పగా ఏవీ జరగడం లేదు. కేంద్రం నుంచీ రాష్ట్రానికి ఎలాంటి సహాయం అందడం లేదని తీవ్ర ఆరోపణలు చేయడం తప్ప కేంద్రం అడుగుతున్న ప్రశ్నలకు సరయిన వివర ణలు ఇవ్వడం లేదని కేంద్రం నుంచే తిట్లు తింటున్నది
తెలంగాణా ప్రభుత్వం. పలుపథకాల లబ్ధి దారు లు కూడా నిజానికి వారికి ప్రకటించిన లబ్ధి పొందడం లేదని అంటున్నారు. ఈ విధంగా ఇంట్లో ఇంతటి వ్యతిరేకత వేడికి ఉడికిపోవడం కంటే వేరు మార్గం చూసుకోవడం ఉత్తమమన్న ధోరణిలో కేసీఆర్ గజ్వేల్ వదులుకుని మెదక్ నుంచి కేంద్రంలోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఏమయినప్పటికీ కేసీఆర్ నిర్ణయం టిఆర్ ఎస్ పార్టీకి ఎంతవరకూ మేలు చేస్తుందని వేచి చూడాలి. ఆయన ఆలోచన, తీసుకున్న నిర్ణయం కేవలం కేంద్రంపై దృష్టి మళ్లడాన్నే తెలియ జేస్తోంది. మరి ఆయన రూటే సపరేటు గదా!