తినగ తినగ వేము..! వర్క్ ఫ్రమ్ హోమ్‌కే వుద్యోగుల ఓటు!!
posted on Jun 8, 2022 @ 12:29PM
హమ్మయ్య మా అబ్బాయి,మా కోడలు ఇంటి దగ్గరే వుంటున్నారు. నాకు చాలా సంతోషంగా వుంది అను కుంటున్నారు మధ్యతరగతి తల్లిదండ్రులు. కరోనా తో వచ్చిన కష్టాలు, నష్టాల కంటే ఈమధ్య ఇలాంటి చిరు సంతోషాలూ వ్యక్తమవుతున్నాయి. ఐటి వుద్యోగాలు చేస్తున్న వారున్నకుటుంబాల్లో .. ఆసలా మాట కు వస్తే దాదాపు ప్రతీ రెండో కుటుంబంలో ఇలాంటి ఓ వుద్యోగి వుంటున్నారు.. వుద్యోగులు నానా అవస్థా పడుతూ ఆఫీ సులకు వెళ్లి రావడం చూసి బాదపడుతూండే తల్లిదండ్రులకు వర్క్ ఫ్రెమ్ హోమ్ అనేది ఒక వరంగా మారింది. ఇది కరోనా కల్పించిన అదృష్టం అంటున్నారు. ఇంతవరకూ బాగానే వుంది. కరోనా దెబ్బకి ఐటి కంపెనీల్లో తమ వుద్యోగులను ఇంటికే పరిమితి చేసేరు. వారికి మొదట కొంత ఇబ్బంది వున్నప్పటికీ తర్వా త అంటే రెండో వేవ్ తో అదే మంచి మార్గమనిపించింది. అయితే వీడియో కాల్స్‌తో, సమావేశాలు నిర్వహిం చు కుంటూనే అచ్చం ఆఫీసులోనే వున్న వాతావరణం వుంటోందని అంటున్నా రు వుద్యోగులు.
తినగ తినగ వేము తియ్యగా నుండు అన్న సామెతలా క్రమేపీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమే వుద్యోగులకు బాగా నచ్చేసింది. ఎందుకంటే రోజూవారి ప్రయాణ ఇబ్బందులు, ప్రయాణం తాలూకు టెన్సన్‌లు వుం డవు. ఇంట్లో పిల్లల్ని, తలిదండ్రుల్ని చూసుకుంటూనే తన వుద్యోగ బాద్యతల్ని కూడా నిర్వర్తించవచ్చ న్నది ఎంతో ఆనందకరం. వుద్యోగులు ఈ తరహా పనితీరుకు అలవాటుపడ్డారు. అయితే ఇందులోనూ ఒక చిక్కు వుంది. అధికారులు వారికి వర్క్ టైమింగ్ పెంచారని, వర్క్‌లోడ్ కూడా పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమ య్యాయి. అయితే ఇంట్లోనే ఒక గదినో, లేదా కొంత ప్లేస్‌ను ఆఫీసు పనికి వుపయోగించుకోవడం అలవాటు చేసుకున్నారు.
మెగా సిటీల్లో అయితే కొందరు వుద్యోగులు.. ఒక కంపెనీకి చెందినవారు.. కలిసి ఒక ఫ్లాట్ తీసుకుని ఆఫీ సుగా మార్చుకున్నారు. ఇది కొంతవరకూ మంచి ఆలోచనే అంటున్నారు. త్రీబెడ్‌రూమ్ ఫ్లాట్ వాళ్లు ఒక గదిని పూర్తిగా ఆఫీస్‌గా మార్చేసుకున్నారు. అదీ భార్యాభర్త వుద్యోగులే అయితే. ఒకరి తర్వాత ఒకరు లేదా ఒకే షిఫ్ట్‌లో వుంటే ఆ గది పూర్తిగా ఆఫీసే! భాగ్యనగరంలో, ఇతర ఐటి హడావుడి వున్న పెద్ద నగరాల్లో ఈ మధ్య కాలంలో కొత్తగా అద్దెకు ఇస్తున్న ఇళ్లు లేదా ఫ్లాట్ ఓనర్లు ఈ ఐటీ వుద్యోగులకు కావలసిన విధంగా ఏర్పాట్లు చేయడానికి ఇష్టపడుతున్నారు. వీరికి కావలసింది వసతులు, వారికి కావలసింది రెంట్!
ఇంటి నుంచి పని బాగానే వుండడంతో ఇప్పుడు ఆఫీసులకు వెళ్లవలసి వస్తుందన్న కొత్త భయమూ పట్టు కుంది వుద్యోగులకు. ఇన్నాళ్లూ ఇంట్లో వుంటూ ఇప్పుడు మళ్లీ వురుకులు, పరుగులకు సిద్ధపడాలనుకోవ డం లేదు. కానీ కరోనా బాగా తగ్గిపోయి అందరూ ఇతర వృత్తి, వుద్యోగలా తమవారిని ఇక ఆఫీసులకు పిల వాలన్న ఆలోచనలో వున్నారు ఐటీ కంపెనీవారు. అయితే ఎలా నిర్వహించాలన్న సందిగ్ధతా లేక పోలే దు. కొందరిని రెండు రకాల షఫ్ట్ విధానాల్లో ఆహ్వానించాలనుకుంటున్నారు.
ఎండాకాలం బడి విధానం లా. బడిలో చిన్న క్లాసులకు పొద్దుటే 8 నుంచి 1 వరకూ 2 నుంచి పెద్ద తరగతులకు క్లాసులు నిర్వహించ డం ఆనవాయితీగా వుంది. ఇపుడు ఐటీ కంపెనీలు ఆ విధానం పాటిస్తాయా? ఏమో? కానీ వుద్యోగులు మాత్రం ససెమిరా వెళ్లమనే అంటున్నారు. పైగా ఇపుడు నాలుగో వేవ్ అంటూ మళ్లీ కొత్తగా భయం పట్టు కుంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ వుద్యోగులను అందరినీ ఒకేసారి పిలవడం ఎంతవరకూ సమంజసమో ఐటీ కంపెనీలకే ఎరుక. కానీ కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా పోయిందనుకోవక్కర్లేదని, నాలుగో వేవ్ అనేది తరలివస్తున్నదని అందువల్ల ఐటీ కంపెనీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదనే అంటోంది.
ఇంటి దగ్గరుండి పనిచేయడం వల్ల చాలామంది వుద్యోగుల ఆరోగ్యపరంగానూ ఎలాంటి సమస్యలు ఎదు ర్కొనడం లేదు. ఇల్లు, ఆఫీసు వేరు వేరు ప్రాంతాల్లో వున్నపుడు వుండే టెన్సన్ ఇపుడు లేదు గనుక ప్రశాం తంగా అన్నిపనులూ సాఫీగానే జరుగుతున్నాయి. ఆరోగ్యసమస్యలు అంతగా లేవనే అంటున్నారు ఐటి వుద్యోగులు. మళ్లీ ఆఫీసులు, ప్రయాణాలు, టెన్షన్లకు గురికావడానికి ఎవరూ సిద్ధంగా లేరు. మరి ఐటి కంపె నీలు వుద్యోగులను ఇంటి నంచి పనిచేయడానికే అంగీకరించి వెళ్లాలంటే ఒక్కింత ఇంటి బెంగతో కూడిన భయం కదలనీయదేమో!!