మాది ఫామ్ హౌస్ పార్టీ అయితే నీది బొల్లి పార్టీనా?
posted on Apr 22, 2013 9:08AM
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టి.ఆర్.ఎస్. పార్టీ పై వ్యాఖ్యలు ఫామ్ హౌస్ పార్టీకి సూట్ కేస్ లు, బయ్యారంపై అప్పట్లో మౌనంగా ఉంది అందుకే ...'' అని వ్యాఖ్యానించడంతో టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కెసిఆర్ ఘాటుగా స్పందించారు. మా పార్టీ ఫామ్ హౌస్ పార్టీ అంటావా? అవును మాది ఫామ్ హౌస్ పార్టీ అయితే నీది పిల్లిగెడ్డం, బొల్లి పార్టీనా? పాలు, కూరగాయల హెరిటేజ్ పార్టీనా? అని టిడిపి కూలిపోతూ కుంటుతోంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ఆశలు లేవు, అందుకే నిరాశా నిస్పృహలకు లోనై పిచ్చి ప్రేలాపనలు పెలుతున్నారు. దిక్కుమాలిన సూట్ కేసుల పార్టీ మాది కాదు టిడిపిదే అని, సూట్ కేసుల మోత బాబుకే అలవాటు, మేం మేం అవిశ్వాసం పెట్టినప్పుడు నిసిగ్గుగా బట్టలిప్పి నగ్నంగా ప్రభుత్వానికి మద్ధతు ఇచ్చింది మీరు కాదా చంద్రబాబూ, అప్పుడు ఎన్ని సూట్ కేసులు పుచ్చుకున్నావో తేల్చిచెప్పాలని బాబుపై కెసిఆర్ మండిపడ్డారు.