గణిత మేథావి శకుంతల మృతి
posted on Apr 22, 2013 @ 9:46AM
సుప్రసిద్ధ మేథమెటీషియన్, కంప్యూటర్ కన్నా వేగంగా లెక్కలు చేసే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శకుంతల దేవి (83), ఎలాంటి ప్రశ్నలకైనా సెకన్లలో సమాధానమిచ్చే శకుంతల దేవి బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శకుంతలా దేవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె గణిత శాస్త్రంలో పలు పరిశోధన గ్రంథాలు రాసారు. కళాశాల విద్యార్థుల కోసం పలుపుస్తకాలు రాశారు. కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆమె గణితశాస్త పరిజ్ఞానాన్ని చూసి, ఆమె వేళ్ళపై లెక్కలు చెప్పే తీరును చూసి పలువురు గణిత, భౌతిక శాస్త్రవేత్తలు అబ్బుర పడి ఆమెకు అబిమానులుగా మారారు.