Read more!

డిప్యూటీ కూడా మాదే: కేసీఆర్ పట్టు!

 

స్పీకర్ పదవికి ఎన్నిక ఏకగ్రీవంగా జరగడానికి ప్రతిపక్షాలు సహకరిస్తే డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వడం అనేది సత్సంప్రదాయం. అయితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక విషయంలో విపక్షాలు సహకరించాయి. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని కోరుతున్నాయి. అయితే టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రెండు పదవులూ తమవే అంటున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిపై కేసీఆర్ వెనక్కి తగ్గటం లేదు. స్పీకర్ ఎన్నిక ఏకపక్షంగా జరిగినందున డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలంటూ విపక్ష నేతలు బుధవారం సీఎం కేసీఆర్ను కలిశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ పదవిపై వెనక్కి తగ్గలేమని ఆయన విపక్షాలకు స్పష్టంగా చెప్పేశారు. దాంతో ప్రతిపక్షాలు ముఖం పావలా అంత చేసుకున్నాయి. ఏం చేస్తారు.. టైమ్!