లోకసభ సభ్యత్వానికి కావూరి రాజీనామా
posted on Oct 27, 2012 @ 1:08PM
కాంగ్రెస్ అధిష్టానం తీరుపట్ల ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను లోకసభ స్పీకర్, సోనియాగాంధీకి పంపించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు వీధేయులను అలక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి దక్కే అవకాశాలు లేఖ పోవడంతోనే కావూరి రాజీనామా చేసినట్లు సమాచారం.