కస్తుర్బా ఆశ్రమానికి మాయని మచ్చ
posted on Oct 9, 2012 @ 12:54PM
జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న కస్తుర్బాఆశ్రమాలు ఇప్పటిదాకా పత్రికల్లో శీర్షికల కింద ఎక్కలేదు. ఎందుకంటే ఈ ఆశ్రమాలను సేవాదృష్టితో నిర్వహిస్తుండటమే కారణం. ప్రత్యేకించి వచ్చిన మార్పులు సిబ్బంది క్రమశిక్షణ కూడా మార్చేస్తుందనటానికి తాజా ఉదాహరణ ఇది. కలుషిత ఆహారం తిని విద్యార్థినులు ఆస్వస్తతకు గురయ్యాయి. ఈ వార్త ఆ ఆశ్రమ నిర్వహణకే మాయని మాచ్చ అనటంలో ఎటువంటి సందేహం లేదు. అనంతపురం జిల్లాలోని నల్లమాడలో ఈ ఘటన జరిగింది. సుమారు 150మంది విద్యార్థినులు అస్వస్తతకు గురవటం సంచలనం. అసలు నిల్వ ఉండే ఆహారాన్ని విద్యార్థులకు ఎప్పుడూ పెట్టిన దాఖలాలు లేని ఈ ఆశ్రమంలో కలుషిత ఆహారం విద్యార్థినులకు అందించారు. ప్రత్యేకించి సిబ్బంది చేతివాటానికి ఈ సంఘటన నిదర్శనంగా తీసుకోవచ్చు. అనంతపురం జిల్లా అధికారులు ఈ విషయమై అప్రమత్తమయ్యారు. విద్యార్థినులను స్థానిక ఆసుపత్రికి చికిత్త నిమిత్తం తరలించారు. దాని తరువాత అసలు ఈ సంఘటన ఎలా జరిగిందనే పూర్వాపరాలు సేకరిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగి ఉంటే తప్పని సరిగా వారిపై చర్య తీసుకునేందుకు వెనుకాడబోమని అనంతపురం జిల్లా అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏ ఆశ్రమంలోనూ ఇటువంటి ఘటన జరగలేదని, అందుకే ఈ ఆశ్రమ నిర్వహణపై సీరియస్‌గా దృష్టి పెడతామని వారు హెచ్చరించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని వారు హామీ ఇచ్చారు.