కర్ణాటక బిజెపీకి బిగ్ షాక్
posted on Apr 17, 2023 @ 1:37PM
మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షట్టర్ సోమవారం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుని ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో చేరడం బిజేపీకి పెద్ద లోటు. బిజేపీ టికెట్ లభించని కారణంగా జగదీశ్ షట్టర్ బిజేపీ నుంచి వైదొలగినట్టు తెలుస్తోంది. ఆదివారం నాడు బిజెపీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మరుసటి రోజే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జగదీశ్ షట్టర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే సమయంలో అఖిల భారత కాంగ్రెస్ నేత మల్లి ఖార్జున ఖర్గే సమక్షంలో చేరారు. బిజేపీ బలోపేతానికి తన శక్తి వంచన మేర పాటుపడ్డానని జగదీష్ షట్టర్ అన్నారు. పార్టీలో తీవ్ర అవమానం జరగడంతో వైదొలగునట్టు చెప్పారు. హుబ్లీ ధార్ వాడ నియోజకవర్గం నుంచి 20 నుంచి 25 వోట్ల నియోజకవర్గం నుంచి గెలుపొందాను.
అక్కడ ఆరుసార్లు విజయం సాధించాను. ఇపుడు ఏడోసారి.
కర్ణాట కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుజేవాలా ఒక ట్వీట్ చేశారు. ఒక కొత్త శకంకు నాంది అని వ్యాఖ్యానించారు. షట్టర్ ఒక ప్రత్యేక విమానంలో హుబ్లీ నుంచి బెంగుళూరు చేరుకుని కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరిపి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జగదీశ్ షట్లర్ ఇటీవలె కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మయ్ , కేంద్ర మంత్రులు ప్రహలాద్ జోషి, ధర్మేంద్ర ప్రదాన్లతో చర్చలు జరిపారు. కానీ వారితో చర్చలు విఫలం కావడంతో జగదీశ్ షట్టర్ తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మే 10వ తేదీన ఇక్కడ జరగనున్న ఎన్నికల్లో జగదీశ్ షట్టర్ పోటీ చేసే అవకాశం లేకపోవడంతో జగదీశ్ షట్టర్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తనకు బిజేపీ టికెట్ రాకపోవడం పెద్ద అవమానమన్నారు. బాధాతప్త మనసుతోనే రాజీనామా చేయాల్సి వచ్చిందని , పార్టీ టికెట్ ఇవ్వక బిజేపీ తనను అవమానపర్చిదని జగదీశ్ షట్టర్ పేర్కొన్నారు. తన మీద పెద్ద కుట్ర జరిగిందని, బిజేపీని కర్ణాటకలో నిర్మించింది తానేనని ఆయన గుర్తు ఆవేదన చెందారు. నన్ను అవమాన పరిచినందుకు ఊరుకునేది లేదని కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచి సమాధానమిస్తానని జగదీశ్ షట్టర్ అన్నారు. బిజేపీ నుంచి వైదొలగడం తన కెంత మాత్రం ఇష్టం లేదని తప్పనిసరి పరిస్థితుల్లో వైదొలగుతున్నట్లు చెప్పారు.
కర్ణాటక బిజేపీలో రెబల్స్ ఎక్కువయ్యారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ మంజునాథ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను పోటీ చేయనున్న నియోజకవర్గం నుంచి మంత్రి తనయుడు పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని మంత్రి నేరుగా తన కుమారుడికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేయడంతో మంజునాథ వైదొలగాడు.