సుభాషణ్ రెడ్డికి లోకాయుక్త పదవి
posted on Oct 11, 2012 @ 11:14AM
మాజీ న్యాయమూర్తి సుభాషణ్ రెడ్డిని లోకాయుక్తగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గతంలో కేరళ, మద్రాసు హైకోర్టులకు ప్రథాన న్యాయమూర్తిగా పనిచేశారు. పదవీవిరమణ చేశాక రాష్ట్ర ప్రభుత్వం సుభాషణ్ రెడ్డిని మానవహక్కుల సంఘం చైర్మన్ గా నియమించింది. పదవీకాలం పూర్తయ్యాక తనకు మరోసారి అవకాశం ఇప్పించాలని ఆయన కోరారు. కానీ.. హెచ్చార్సీ చట్టం అనుమతించని కారణంగా ఆయనకు అప్పట్లో అవకాశం లభించలేదు. తాజాగా జస్టిస్ ఆనందరెడ్డి పదవీవిరమణ చేయడంతో ఆ పదవిలో జస్టిస్ సుభాషణ్ రెడ్డిని నియమించారు. గవర్నర్ పెద్దగా సుముఖంగా లేకపోయినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి సుభాషణ్ రెడ్డికి లోకాయుక్త పదవిని ఇప్పించడం విశేషం.