లారీ లు తీసుకువచ్చి బస్సులు కింద మార్చారు. ఆ బస్సుల్లో ప్రయాణం ప్రాణాంతకం!!

ఇంజన్ లారీ ది. బాడీ మాత్రం బస్సుది. ఇది తాడిపత్రి మాయాజాలం అంతే. ఈ సంగతి ని తిరగదోడిన ఏపీ రవాణా శాఖ జాయింట్ కమీషనర్ ప్రసాద రావు ఏమంటున్నారో ఆయన మాటల్లోనే విందాం... 2017 లో సుప్రీంకోర్టు లో ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం BS 3 వాహనాలు అమ్మకూడదని చెప్పింది. జాటధర కంపెనీ, సి గోపాలకృష్ణ కంపెనీ Bs 3 వాహనాలు కొని దొంగ రిజిస్ట్రేషన్స్ చేయించారు. 66 వాహనాలకు సంబంధించి ఫిర్యాదు వచ్చాయి. వాహనాలకు సంబంధించి అశోక్ లేల్యాండ్ కంపెనీ కి సమాచారం అడిగాం. నాగా ల్యాండ్ లో 2018 సెప్టెంబర్ లో రిజిస్ట్రేషన్ చేయించారు. అక్కడి నుంచి నో అబ్ జెక్షన్  కింద ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయి. 45 లారీలు ఏపీ లో ఉన్నాయి

అశోక్ లేల్యాండ్ కంపెనీ 66 లారీ లను స్క్రాప్ కింద అమ్మేసారు. వాహనాలన్ని సి గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ, జటదర్ కంపెనీ కింద రిజిస్ట్రేషన్ అయ్యాయి. వాహనాలు కొనుగోలు సమయంలో తాడిపత్రి లో పర్మనెంట్ అడ్రెస్  నాగల్యాండ్ లో టెంపరరీ అడ్రెస్ పెట్టారు. జేసీ ఉమ్మారెడ్డి 4 వాహనాలకు సంతకం చేశారు. 2 వాహనాలకు సి గోపాల్ రెడ్డి పేరుతో సంతకం చేశారు. 6 వాహనాలకు సంబంధించి వాహన యజమానుల తో పాటు అశోక్ లేల్యాండ్ కంపెనీ పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసాం. దొంగ ఇన్సూరెన్స్ లు పెట్టారు. యునైటెడ్ చీఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తో కూడా ఈ విషయంపై మాట్లాడుతున్నాం. ఈ వ్యవహారంపై జాయింట్ కమిషనర్ నేతృత్వంలో యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. దేశంలో తిరగడానికి వీలులేని వాహనాలను తిప్పుతున్నారు. పోలీసుల సర్టిఫికెట్ లు కూడా దొంగవి పెట్టారు. పోలీస్ శాఖ కూడా క్రిమినల్ కేస్ లు కూడా పెట్టింది. కంపెనీ కూడా ఇన్వాల్వ్ అయితే 100 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందివాహనాలకు సంబంధించిన లావాదేవీలు నిలిపి వేశాం. 25 వాహనాలు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్న కారణంగా ఆ రాష్ట్రాలలో కూడా  లావాదేవీలు నిలిపివేయాలని కోరమన్న జాయింట్ కమిషనర్ ప్రసాద రావు.

సీజ్ చేసే ప్రక్రియ మొదలు పెట్టాం. ఇప్పటికి 23 వాహనాలు సీజ్ చేసాం. 45 లో 23 వాహనాలు సీజ్ చేసాం. ఆ ఇద్దరు వాహనాలు కొని వేరే వ్యక్తులకు అమ్మేశారు. వాహనాలు కొని మోసపోయిన వారు అమ్మిన వారిపై కేసులు పెట్టాలని సూచించాం. రవాణాశాఖ లో ఎవరైనా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకుంటాం. ఇంకా 88 వాహనాలు నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నాయి. జటధర ఇండర్స్ట్రీస్,సి గోపాల కృష్ణ కంపెనీ కి చెందిన 80 బస్సులు ఉన్నాయి. లారీ లు తీసుకువచ్చి బస్సులు కింద మార్చారు. ఆ బస్సుల్లో ప్రయాణం ప్రాణాంతకం.

88 వాహనాలకు సంబంధించి 3 కేసులు నమోదు అయ్యాయి. 23 వాహనాలకు సంబంధించి రవాణా శాఖ అధికారుల ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తి లేదు. అన్ని వాహనాలు అనంతపురంలో రిజిస్ట్రేషన్స్ జరిగాయి. లారీ ఛాసిస్ తో 3 బస్సులు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టు క్యారియర్స్ నడిపే వారిపై 4.75 కోట్ల రూపాయలు జరిమానాలు కింద వసూలు చేశామన్న జాయింట్ కమిషనర్.

Teluguone gnews banner