పోలీస్ కత్తి విసిరాడు.. 3 ఏళ్ళ బాలుడు కంట్లో గుచ్చుకుంది ఇక అంతే..
posted on Jun 7, 2021 @ 2:54PM
పిల్లలు అన్నాక మారాం చేస్తారు అల్లరి కూడా చేస్తారు.. తెలియని ప్రాయం కొంచం పెద్దవాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు. కానీ మూడు ఏళ్ళ పిల్లవాడికి ఏం తెలుస్తుంది. చెప్పండి.. గేమ్ ఆడిస్తాను అని పిలిచాడు.. పిలిచినప్పుడు రాలేదనే కోపంతో ఆ బాలుడిపై కత్తి విసిరాడు..ఒక పోలీస్ దుర్మార్గుడు..ఆ కత్తి నేరుగా ఆ బాలుడి కంట్లో గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆ బాలుడిని విశాఖలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు చికిత్స అందించారు. అసలు ఏం జరిగింది.. చివరికి ఆ బాబుకి ఏమైంది అనుకుంటున్నారా..
అయితే మీరే చదవండి..
అది తూర్పుగోదావరి జిల్లా. రామచంద్రాపురం. బ్రాడీపేట ప్రైవేటు ఆసుపత్రుల వీధిలో రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన నల్లమోతు వాణి, తన అమ్మ, తన మూడు సంవత్సరాల కొడుకుతో కలిసి నివాసముంటోంది. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామానికి చెందిన డి.రాము రామచంద్రపురం సబ్ జైల్ హెడ్ వార్డర్‌గా వర్క్ చేస్తున్నాడు.. అదే వాణి వాళ్ళు ఉండే ఇంటి పై అంతస్తులో అద్దెకు ఉంటున్నారు.
వాణి కొడుకు ధన సిద్దేశ్వర్. పిల్లవాడికి బోరు కొట్టినప్పుడు తరచూ ఆడుకునేందుకు ఇంటి పై ఉన్న రాము దగ్గరికి పై అంతస్తుకు వెళ్లేవాడు. గత నెల 24న అలా వెళ్లిన ఆ చిన్నారికి సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడిస్తాను రా.. అంటూ రాము పిలిచాడు. కాసేపటి తర్వాత ఆ చిన్నారి అల్లరి చేస్తున్నాడని తన చేతిలో ఉన్న చాకును విసిరాడు. అది బాలుడి ఎడమ కన్నుకు తగిలింది. ఆడుకునేందుకు వెళ్లిన తన కుమారుడి ఏడుపు వినిపించడంతో వాణి పైకి వెళ్లి చూడగా కొడుకు ఎడమ కంటి నుంచి రక్తం కారడాన్ని గమనించి షాకైంది.
చిన్నారిని వెంటనే వేమగిరి ఆస్పత్రికి తరలించగా.. వైద్యుల సూచన మేరకు విశాఖపట్నంలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలుడి కంట్లో నరాలు పాడయ్యాయని, కంటిచూపుకే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. వాణి ఫిర్యాదు మేరకు రామచంద్రపురం సీఐ శ్రీనివాస్... నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.