భూపాలపల్లి సభకు వెళ్లని జగ్గారెడ్డి.. కారణాలు చెబుతూ వీడియో మెసేజ్
posted on Sep 30, 2021 @ 6:30PM
గురువారం, సెప్టెంబర్ 30న భూపాలపల్లి లో గండ్ర సత్యనారాయణ రావు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్ష్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగే సభకు రావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఆహ్వనం అందిందిని. భూపాలపల్లి నియోజకవర్గం వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గానికి జగ్గారెడ్డి ఇంఛార్జి. సో... జగ్గారెడ్డికి ఆహ్వానం అందింది. స్వయంగా రేవంత్ రెడ్డి, అలాగే పార్టీలో చేరుతున్న సత్యనారాయణ రావు ఫోన్ చేసి, రావాలని జగ్గారెడ్డిని ఆహ్వానించారు అయితే, కోర్టు కేసుల కారణంగా జగ్గారెడ్డి భూపాలపల్లి వెళ్ళే పరిస్థతి లేదు. ఆ విషయం రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్ ఛార్జ్ మాజీ మంత్రి,మంథాని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, అలాగే సత్యనారాయణ రావుకు జగ్గారెడ్డి చెప్పారు.
నిజానికి ఇది పార్టీ అంతర్గత వ్యవహారం, కానీ, జగ్గారెడ్డి, బహుశా ఇటీవల రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వలేదని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపి , చివరకు క్షమాపణ చెప్పవలసి వచ్చిన నేపధ్యంలో కావచ్చు, జగ్గారెడ్డి మీడియా మిత్రులకు కూడా ఓ వీడియో సందేశం పంపారు. పైన చెప్పిన కధంతా చెప్పి చివర్లో, తాను హాజరు కాలేదని మీడియాలో వేరే సంకేతాలు వెళ్ళకుండా ఉండేందుకే, ఈ వీడియో అంటూ .. జగ్గారెడ్డి, విలేకరులు నారదమినీ పాత్రను పోషిస్తారని అనుకున్నారో, ఆయన ఉద్దేశం ఇకేమో కానీ, అనవసర కథలు వండవద్దని మీడియా మిత్రులకు వివరణతో కూడిన విజ్ఞప్తి చేశారు.
కోర్టు కేసులకు సంబందించి కూడా జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. ఈ కోర్ట్ కేసులన్నీ గతంలో మంజీరా నీళ్లు తరలించి తీసుకుపోయిన్నపుడు చేసిన ధర్నా, ఉద్యమం,సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కావాలని చేసిన ఉద్యమాలు పై పెట్టిన రాజకీయ కేసులని ... ఇది మీడియా మిత్రులు గమనించాలని ...విజ్ఞప్తి చేశారు. బాగుందిగా ... ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లు జగ్గారెడ్డి మీడియా మీద పడ్డారు ..ఏమిటో ..