బొత్స ఒక బేవకూఫ్.. ఇలాంటి వాళ్ళవల్లే జగన్ నాశనమయ్యాడు- పీకే
posted on May 12, 2024 @ 2:26PM
తాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో చేతులు కలిపానని, చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకున్నానని, అందుకే జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు మాట్లాడుతూ వుండటం పట్ల ప్రశాంత్ కిషోర్ చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ‘‘చంద్రబాబుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను తమిళనాడు ఎన్నికల తర్వాత ‘ఐ ప్యాక్’తో సంబంధాలు తెంచుకున్నాను. ఏ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా లేను. నేను చంద్రబాబు కోసం పనిచేస్తున్నట్టయితే హైదరాబాద్‌లో ఎందుకు వుంటాను... ఆంధ్రప్రదేశ్‌కే వెళ్తాను. ఏపీలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా నాకు సంబంధం లేదు.. చంద్రబాబు దగ్గర నేను డబ్బు తీసుకున్నానని అంటూ బొత్స సత్యనారాయణ నన్ను అవమానిస్తూ మాట్లాడుతున్నాడు. నేను డబ్బు తీసుకుని పొగిడే వాడిని అయితే బొత్స కూడా నాకు డబ్బు పంపిస్తే ఆయన్ని కూడా పొగుడుతాను కదా.. బొత్స మంత్రి పదవిలో అక్రమంగా బాగానే సంపాదించాడు కదా.. నేను డబ్బు తీసుకుని జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని అనుకుందాం.. మరి జగన్ తల్లి విజయమ్మ ఎందుకు జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతోంది? జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడమని ఆమెకి ఎవరు డబ్బు ఇచ్చారు. జగన్ చెల్లెలు షర్మిలకు ఎవరు డబ్బు ఇచ్చారు? విజయమ్మ, షర్మిల ఇద్దరూ జగన్‌ని వ్యతిరేకించడం జగన్ పతనాన్ని సూచిస్తోంది. జగన్ జైల్లో వున్నప్పుడు షర్మిల ఎంతో శ్రమపడింది. అయినప్పటికీ ఆమెని తిడుతున్నారు. గత ఎన్నికలలో నేనూ జగన్ పార్టీ విజయానికి కృషి చేశాను. నన్నూ తిడుతున్నారు. బొత్సలాంటి బేవకూఫ్‌లు జగన్ పక్కన వుండటం వల్లే జగన్ ఇలా నాశనం అయిపోయాడు. గతంలో జగన్‌కి మద్దతుగా నిలిచిన వాళ్ళని కృతజ్ఞత లేకుండా నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. ఇదే వాళ్ళ కేరక్టర్లు ఏమిటో చెబుతూ వుంటుంది. బొత్స ఏ పార్టీలో వుంటే ఆ పార్టీని మోసం చేశాడు. 2019లో వైసీపీ గెలవకపోతే బొత్స ఎక్కడ వుండేవాడు? ఈ ఎన్నికల తర్వాత బొత్స అండ్ ఆయన వైఫ్ ఇద్దరూ తెలుగుదేశం వైపు నడుస్తారు చూస్తూ వుండండి. వీళ్ళు కృతజ్ఞత లేని మనుషులు. కృతఘ్నత కంటే పెద్ద పాపం మరొకటి లేదని భగవద్గీతలో చెప్పారు. నా విషయంలో కావచ్చు, విజయమ్మ విషయంలో కావచ్చు, షర్మిల విషయంలో కావచ్చు, జనం విషయంలో కావచ్చు... ఎవరి విషయంలోనూ కృతజ్ఞత అనేదే అనేదే లేకుండా వ్యవహరిస్తున్న జగన్ అండ్ టీమ్ ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తారు. చూస్తూ వుండండి..ఈ ఎన్నికల తర్వాత జగన్ 2019 ముందు నాటి పరిస్థితికి వెళ్ళిపోతాడు’’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.