ఈవీఎంల మీద జగన్ సుద్దపూస ట్వీట్!
posted on Jun 18, 2024 @ 10:17AM
సంప్రదాయినీ.. సుప్పినీ.. సుద్దపూసనీ లాగా నంగి వేషాలు వేయాలంటే మన మాజీ ముఖ్యమంత్రి జగన్ తర్వాతే ఎవరైనా. తాను ఐదేళ్ళపాటు అద్భుతంగా పరిపాలించానని, ఎక్కడో ఏదో తేడా జరిగి తాను ఘోరంగా ఓడిపోయానని ఆయన బలంగా నమ్ముతున్నారు. శ్లేష్మంలో ఈగలాగా అలాంటి నమ్మకంలో కొట్టుమిట్టాడుతున్న ఆయన కళ్ళకు ఏం కనిపిస్తుంది? ఈవీఎంలు కనిపిస్తాయి. అందుకే తన ఓటమికి బాధ్యతని ఈవీఎంలకి అంటగట్టే ప్రయత్నం మొదలెట్టారు. అందులో భాగంగా ఎక్స్ అలియాస్ ట్విట్లర్లో ఒక మెసేజ్ పారేశారు. ఆ మెసేజ్‌లో సారాంశం ఏంటంటే, ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియల్లో అభివృద్ధి చెందిన అన్ని ప్రజాస్వామ్య దేశాలు పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నాయి. ఈవీఎంలను వాడటం లేదు. మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని చాటిచెబుతూ మనం కూడా పేపర్ బ్యాలెట్ దిశగా అడుగులు వేయాలి. జరిగిన న్యాయం కనిపించాలని ఏ విధంగానైతే కోరుకుంటామో... అలాగే ప్రజాస్వామ్యం పటిష్టంగా వుండటమే కాకుండా, నిస్సందేహంగా ప్రబలంగా కనిపించాలి’’ అని. అమ్మా జగనూ.. నీ పని అయిపోయింది. నువ్వెన్ని సుద్దపూస కబుర్లు చెప్పినా జనం నమ్మరు. అది తెలుసుకో ముందు.