ఆత్మహత్యా సదృశ్యం జగన్ రెడ్డి పరిపాలన...

రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే,  ఆత్మహత్య సదృశ్యం జగన్ రెడ్డి పరిపాలనాని అంటారు  సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాదం.  తిరుపతి, అనంతపురం, మాచర్లలో జరిగిన అల్లర్ల, విధ్వంసం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు ధ్వంసం చేసిన ఘటనలో వైసిపి పాత్ర వుంది. వీటన్నింటిపై సిట్ దర్యాప్తు జరుగుతుంది. కారకులైన వారు న్యాయస్థానంలో దోషిగా నిలబడక తప్పదని ఆయ‌న హెచ్చరించారు. 

ఈ ఎన్నికల్లో ఓటమి చెందుతున్నామని గ్రహించి జగన్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. 50 మంది ఎమ్మెల్యేలను మార్చినప్పుడే ఓడిపోయాడని, డీజీపీని మార్చినప్పుడు తనంతట తానే ఎన్నికలు అనుకూలంగా జరగవేమో అని జగన్ రెడ్డి ఓటమికి అంగీకరించాడు అన్నారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ తో జగన్ రెడ్డి డిఫెన్స్ లోకి వెళ్లిపోయాడు అన్నారు.

చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల ద్వారా పూర్తిగా జగన్ రెడ్డి కి అష్టదిగ్బంధనం జరిగింది. జగన్ రెడ్డి అధికారం అంటే పెట్టుకొని పోల్ మేనేజ్మెంట్ చేద్దామనుకున్నాడని, కానీ ప్రజల తీర్పుతో తోక ముడిచాడు.  మూడు రాజధానుల ఉద్యమం, ఒక రాజధాని ఉద్యమం రెండు ఉద్యమకారులను మోసం చేసి వారి ఉసురు తగిలి జగన్ రెడ్డి కాలగర్భంలో కలిసిపోతున్నాడు. 

పేద, పెత్తందారుల తేడా లేకుండా జగన్ రెడ్డి పరిపాలన వల్ల అయిదు కోట్ల మంది బాధితులైయ్యారు.  డిబిటి కింద రెండు లక్షల 75 వేల కోట్లు, నాన్ dbt కింద 1,25,000 కోట్లు ఈ ఐదు సంవత్సరాలలో  50 లక్షల మంది లబ్ధిదారులకు అందించానని అబద్ధాలు చెబుతూ, దారి మళ్లించిన నొక్కేసిన 8 లక్షల కోట్ల రూపాయల లెక్కలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు 1,25,000 కోట్లు అవుతాయని జగన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం.

- ఎం.కె. ఫ‌జ‌ల్‌

Teluguone gnews banner