బటన్లు నొక్కితే సీఎం అయిపోరు.. రఘురామకృష్ణం రాజు
posted on Mar 3, 2023 8:45AM
ఒకరి కడుపు కొట్టి మరొకరి ఖాతాలోకి సొమ్ములు జమచేయడానికి బటన్లు నొక్కుతున్న జగన్ ను జనం సమర్ధించరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఎగ్గొట్టి ఇ సోమ్మును జనాలకు ఇవ్వడాన్ని జగన్ ఏ విధంగా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. గురువారం రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన బటన్లు నొక్కి మరో సారి సీఎం అయిపోదామనుకుంటున్న జగన్ ఆశలు ఫలించవని ఆయన అన్నారు.
ముందు లక్ష కోట్ల రూపాయలు చెల్లించి సెటిల్ చేసిన తరువాత చూసుకుందాం అప్పటి వరకూ అమరావతే రాజధాని అని చెబితే జగన్ ఏం చేస్తారని ప్రశ్నించారు. పార్లమెంటులో చట్టం ద్వారా ఏర్పాటైన రాజధానిని కాదనిరైతులకు లక్ష కోట్ల రూపాయలిచ్చి సెటిల్ చేయండి ఆ తర్వాత చూసుకుందామని అప్పటివరకు అమరావతియే రాజధాని అని సుప్రీం కోర్టు చెబితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమి చేస్తారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. పార్లమెంట్ చట్టం చేసిన రాజధానిని కాదని, జగన్ చేయగలిగిందేమీ లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు.
రాజధాని అంశంపై ప్రభుత్వం పదేపదే సుప్రీం కోర్టును ఆశ్రయించడం ఉన్మాదమేనని విమర్శించారు. అమరావతి విషయంలో ముందస్తు తేదీని ప్రకటించమని న్యాయమూర్తులను కోరడం హాస్యాస్పదమని రఘురామకృష్ణం రాజు అన్నారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారినట్లు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారని ఆయన అన్నారు. ఉన్నత విద్యావంతుడైన విజయసాయి గతంలో చేసిన ట్వీట్లు చాలా అసహ్యంగా ఉండేవనీ, అయితే ఇటీవలి కాలంలో ఆయన తీరు మారిందని, ఆయన ట్వీట్లు సంస్కారవంతంగా ఉంటున్నాయనీ చెప్పారు. రాజ్యసభ ప్యానల్ కు ఎన్నికై.. ఆ తరువాత తొలగింపునకు గురై మళ్లీ ఎంపికైన తరువాత విజయసాయి వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి తెనాలి సభలో బటన్ నొక్కి రైతుల ఖాతాలో డబ్బులు చేసినట్టుగా నాటకమాడినప్పటికీ విజయ సాయి రెడ్డి ఆహా..ఓహో అనకుండా, వాస్తవంగా రైతుల ఖాతాలలో బటన్ నొక్కి రైతుల ఖాతాలు డబ్బులు జమ చేసిన ప్రధానమంత్రిని అభినందిస్తూ ట్వీట్ చేయడమే ఆయనలో మార్పునకు తార్కానమని అన్నారు.