టాలీవుడ్‌కు ప్రభుత్వం బెదిరింపులు!.. బాహుబలి కలెక్షన్స్‌తో బ్లాక్‌మెయిల్?
posted on Sep 29, 2021 @ 11:22AM
పవన్‌కల్యాణ్ వర్సెస్ వైసీపీ ప్రభుత్వం. ఇద్దరి మధ్య వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. రిపబ్లిక్ వేదికగా జనసేనాని.. ఆన్‌లైన్ టికెట్ల వ్యవహారాన్ని ఏకిపారేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని సన్నాసంటూ కుమ్మేశారు. తన సినిమాలను టార్గెట్ చేశారని.. ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలతో అప్పులు తెచ్చుకునే స్కెచ్ అంటూ విమర్శించారు. పవన్ మాటలకు.. మంత్రులు సైతం అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. మధ్యలో పోసాని ఎంటరై రచ్చ మరింత రాజేశారు.
విచిత్రం ఏంటంటే.. ఏ ఇండస్ట్రీ కోసమైతే పవన్‌కల్యాణ్ అంతలా నోరు పారేసుకున్నారో.. అదే ఇండస్ట్రీ నుంచి పవన్ మాటలపై డివైడ్ టాక్ వినిపిస్తుండటం ఆశ్చర్యకరం. రిపబ్లిక్ ఈవెంట్ ముగిసిన మర్నాడే.. సర్కారుకు సపోర్ట్‌గా, పవన్‌కు వ్యతిరేకంగా డైలాగులు వదిలారు. మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు.. పవన్ మాటలను తాను సమర్థించనని అన్నారు. మోహన్‌బాబును పీకే కార్నర్ చేశారు కాబట్టి ఆయన కొడుకుగా మంచు విష్ణు అలా అన్నారని అనుకోవచ్చు. కానీ, ఏకంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సైతం అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేస్తూ స్టేట్‌మెంట్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? తమకు రెండు ప్రభుత్వాల మద్దతు అవసరమని.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అలా బహిరంగ ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫిల్మ్ ఛాంబర్ అలాంటి ప్రకటన ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చిందా? వైసీపీ సర్కారు ఆదేశాల మేరకే ఫిల్మ్ ఛాంబర్ ఆ స్టాండ్ తీసుకుందా? అనే అనుమానం.
ఇక, రెండు రోజులు ఆగి సీఎం జగన్ ఆంతరంగిక మనిషి, ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. చాలా వ్యూహాత్మకంగా మాట్లాడారు. మొత్తం తెలుగు సినీ పరిశ్రమను టార్గెట్ చేస్తూ.. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. ఆన్‌లైన్ టికెటింగ్ అవసరాన్ని నొక్కి చెబుతూ.. బాహుబలి కలెక్షన్స్‌ను ప్రస్తావించారు. బాహుబలి మూవీ విడుదలైన తొలి వారంలో థియేటర్లలో సగం సీట్లు ఖాళీగా ఉన్నట్లు చూపించారని అన్నారు. ఫస్ట్‌వీక్ కలెక్షన్స్‌లో సగం డబ్బు ప్రభుత్వానికి, డిస్ట్రిబ్యూటర్లకూ వెళ్లలేదని తెలిసిందని ఆరోపించారు. ఈ లెక్కన ఎంత మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు పన్ను రాలేదో తేల్చాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారంపై నిజం నిగ్గుతేలేలా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ సంచలన కామెంట్లు చేశారు సజ్జల.
సజ్జల కామెంట్స్‌తో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. తెలుగు సినిపరిశ్రమలో రాజమౌళి, బాహుబలిలు లెజెండ్స్, ట్రెండ్‌సెట్టర్స్. అలాంటిది బాహుబలి కలెక్షన్స్‌లో గోల్‌మాల్ జరిగిందని ప్రభుత్వం ఆరోపించడం.. దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం.. పక్కా బెదిరించడమేనని అంటున్నారు. పవన్ కల్యాణ్‌కు సపోర్ట్‌గా నిలిస్తే.. ఇలా సినిమా దందాలన్నిటికీ చెక్ పెడతామని బ్లాక్‌మెయిల్ చేయడమే అని అనుమానిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండకపోతే.. ఇలాంటి దర్యాప్తులు ఇంకా చాలానే ఉంటాయని.. బహుబలి సినిమానే వదలని ప్రభుత్వం ఇక మిగతా మూవీలను వదిలిపెడుతుందా? మరి, అలా జరగకూడదంటే ఇండస్ట్రీ మొత్తం జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాల్సిందేననే హెచ్చరిక ధోరణి అందులో కనబడుతోంది. తమను కాదని పవన్ వెనుక చేరి తోక జాడిస్తే.. దర్యాప్తులతో తోక కట్ చేస్తామనే అర్థం వచ్చేలా.. సీఎం జగన్ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి బాహుబలి కలెక్షన్ల పేరుతో తెలుగు సినీపరిశ్రమను బ్లాక్‌మెయిల్ చేశారని అంటున్నారు.